హీరోయిన్ తో ఘనంగా నోయెల్ వివాహం: హాజరైన రాజమౌళి

05:31 - January 6, 2019

టాలీవుడ్ లో సింగర్ గా నటుడిగా చిరపరిచితం అయిన నోయెల్ పెళ్ళిచేసుకున్నాడు. ఎస్తేర్ నోరోన్హా అనే నటితో క్రైస్తవ మత సంప్రదాయంలో కర్ణాటకలోని మంగళూర్ లో ఘనంగా జరిగింది.  వైభవంగా జరిగిన ఈ పెళ్లికి ఇరు కుటుంబాల సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు హాజరయ్యారు. అనంతరం సోషల్ మీడియా ద్వారా తన పెళ్లి వార్తను అభిమానులతో పంచుకొన్నారు.

కొన్నిన్ని రోజులుగా ప్రేమలో ఉన్న ఈ జంట తాజాగా పెళ్లి పీటలెక్కింది. ఈ సందర్భంగా పెళ్లిలో దిగిన ఫోటోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. ‘మేము ఇద్దరం కాదు.. ఒక్కటే. నా హృదయానికి ఆమే రాణి’ అని నోయల్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. వీరి వివాహానికి దర్శకధీరుడు రాజమౌళి తదితరులు హాజరయ్యారు. వీరికి ర‌ష్మీ, అన‌సూయ త‌దిత‌రులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. 


 నోయ‌ల్ చాలా చిత్రాల‌లో స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ వేసి మెప్పించాడు. నటుడిగా "మగధీర", "ఈగ", "కుమారి 21 ఎఫ్", "నాన్నకు ప్రేమతో", "ప్రేమమ్", "రంగస్థలం", "హలో గురు ప్రేమ కోసమే", "పడి పడి లేచె మనసు" వంటి సినిమాల్లో నటించి నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. టీవీ కార్యక్రమాలతోనూ చాలా పాపులారిటీ సంపాదించాడు. తమిళ్‌లో నోయెల్ హోస్ట్ చేస్తున్న ‘సరిగమపా’ ప్రోగ్రామ్‌కు విశేష ఆదరణ ఉంది. 


  ఇక వధువు "ఎస్త‌ర్ నోరోన్హా" దర్శకుడు తేజ తెర‌కెక్కించిన వెయ్యి అబ‌ద్ధాలు సినిమాతో పాపుల‌ర్ అయింది. ఆ తర్వాత సునీల్ హీరోగా తెరకెక్కిన ‘భీమవరం బుల్లోడు’ సినిమాలో నటించింది. అనంతరం చాలా గ్యాప్ తర్వాత  బోయ‌పాటి శీను తెర‌కెక్కించిన "జ‌య జాన‌కి నాయ‌క" చిత్రంలోను న‌టించింది. ప్ర‌స్తుతం హిందీ, మ‌రాఠీ, తెలుగు , త‌మిళ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది ఈ అమ్మ‌డు. రీసెంట్‌గా వీరిద్ధ‌రు కొంక‌ణి వ‌ర్షెన్‌లో "డిస్పెకిటో" అనే క‌వ‌ర్ సాంగ్ చేశారు. ఈ సాంగ్‌కి యూ ట్యూబ్‌లో రెండు ల‌క్ష‌ల‌కి పైగా వ్యూస్ వ‌చ్చాయి .