సాయిధరమ్‌ కోసం త్యాగరాజైన బన్నీ

10:47 - December 28, 2018

సాయిధరమ్ కెరీర్ ప్రస్తుతం ఏమంత బాగోలేదు. ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టేశాడు. ఇకమీదట హిట్ కొట్టకపోతే.. మనోడ్ని మర్చిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. ఇక సాయిధరమ్‌ కోసం బన్నీ త్యాగరాజు అవతారం ఎత్తవలిసి వచ్చింది. అతేంటో వివరాల్లోకి వెలితే... సాయిధరమ్‌ కెరియర్‌ని ఎలాగైనా బాగుచేయాలని, అతనితో హిట్‌ సినిమా చేయించాలని మెగాస్టార్‌ రంగంలోకి దిగారు. అల్లు అరవింద్ని కలిసి సాయితో మంచి సినిమా తీయమని ఆర్డర్ వేశారు. ఇప్పటికిప్పుడు అరవింద్ చేతిలో ఉన్న డైరెక్టర్ పరుశురామ్. పరుశురామ్ ఏమో బన్నీని దృష్టిలో పెట్టుకుని కథ సిద్ధం చేసుకుంటున్నాడు. బన్నీ కూడా పరుశురామ్తో సినిమా చేసేందుకు సిద్ధమైపోయాడు. కథ కూడా దాదాపుగా పూర్తైంది. మరి ఇలాంటి టైమ్లో ఇప్పుడు వేరే సినిమా వేరే కథ అంటే కష్టం. కానీ ఎలాగైనా సాయి కెరీర్‌ ఊపందుకోవాలి. ఇంత పరిస్థితిని అర్ధంచేసుకున్న బన్నీ త్యాగరాజు అవతారం ఎత్తాడం జరిగింది. పరుశురామ్ని సాయిధరమ్ తేజ్ కోసం త్యాగం చేసేశాడు. తన కోసం ఇప్పటికే త్రివిక్రమ్ రెడీగా ఉన్నాడు. అదీగాక.. సాయికి హిట్ తప్పనిసరి. కానీ బన్నీకి అలాకాదు. ఆల్రెడీ స్టార్. ఇలాంటి స్టార్కు త్రివిక్రమ్ కలిస్తే సినిమా హిట్ గ్యారంటీ. ఇవన్నీ ఆలోచించే.. తన దర్శకుడ్ని సాయి ధరమ్ కోసం ఇచ్చేశాడు బన్నీ.