రేపే మన ఫేవరెట్‌ సాంగ్‌ రాబోతోంది: కియారా

15:44 - January 5, 2019

ఇటీవలే  '  భరత్ అనే నేను ' చిత్రంలో వసుమతిగా యువ హృదయాలను దోచేసింది కియారా అద్వానీ. ఆ క్యారెక్టర్‌తో టాలీవుడ్‌లో ఆమెకు ఫాలోవింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక తాజాగా రామ్‌చరణ్ హీరోగా రాబోతున్న  '  వినయ విధేయ రామ '  చిత్రంలో చెర్రీ సరసన సీతగా మరోసారి థియేటర్లలో గోల చేసేందుకు సిద్దమయ్యింది కియారా. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు చిత్రానికి భారీ హైప్ తీసుకొచ్చాయి. కాగా తాజాగా చిత్రంలోని  '' రామ లవ్స్ సీత '' సాంగ్ ప్రోమోను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్రయూనిట్. ఈ మేరకు.. రేపు (ఆదివారం) సాయంత్రం 4 గంటలకు ఈ సాంగ్ ప్రోమో ప్రేక్షకుల ముందుంచనున్నామని తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్‌ని ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్న కియారా.. రేపే మన ఫేవరేట్ సాంగ్ రాబోతోంది అని ట్యాగ్ చేసింది. చిత్రంలో ఈ సాంగ్ హైలైట్ కానుందని తెలుస్తుండటం పైగా కియారాకు ఫేవరేట్ కావటంతో ఈ పాట చూడాలని ఆసక్తిగా ఉన్నారు ప్రేక్షకులు.  బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.