రాణా స్టేట్‌మెంట్‌తో...త్రిషా ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌

13:36 - December 25, 2018

కరణ్ తో కాఫీ.. అదేనండీ 'కాఫీ విత్ కరణ్' షో లో ఎవరు పాల్గొన్నా.. ఒక వారం రోజుల పాటు మీడియాలో హంగామా తప్పదు.  ఎందుకంటే కరణ్ పర్సనల్ లైఫ్ మీద ప్రశ్నలు అడుగుతాడు. ఇలాంటి షోలో ఈమధ్య రాజమౌళి.. ప్రభాస్.. రానా దగ్గుబాటి అతిథులుగా పాల్గొన్నారు. ఈ షోలో భాగంగా కరణ్ రానాను త్రిష గురించి అడిగాడు.  ఇప్పటివరకూ ఎవరు త్రిష గురించి అడిగినా.. మంచి ఫ్రెండ్ మాత్రమే అని చెప్పే రానా మొదటి సారి త్రిషతో ఓ రెండు నెలలపాటు డేటింగ్ చేశానని.. కానీ ఆ రిలేషన్ అంతకుమించి ముందుకు సాగలేదని ఓపెన్ గా చెప్పాడు.  కరణ్ అడగడం.. రానా చెప్పడం అంతా బాగానే ఉంది కానీ ఆ హీట్ ఇప్పుడు త్రిషకు తగిలింది. ఎప్పుడైతే త్రిషతో డేటింగ్ చేస్తినట్టు రానా వెల్లడించాడో.. అప్పటి నుంచి త్రిష ఫోన్‌ మొగుతూనే ఉందట!. ఎందుకనుకుంటున్నారా?...రాణా స్టేట్‌మెంట్‌ విన్న మీడియా వారు.. ఫ్రెండ్స్ త్రిష - రానాల మధ్య ఏం జరిగింది.. ఎందుకు పెళ్లి వరకూ వెళ్ళలేదు.. లాంటి వివరాలు కనుక్కోవడానికి తెగ ఉబలాటపడుతున్నారట! ఈ గోల తట్టుకోలేక త్రిష తన ఫోనును స్విచ్ ఆఫ్ చేసిందట.  ఎవరు ఫోన్ చేసినా "మీరు సంప్రదించాలనుకున్న  వ్యక్తి అందుబాటులో లేరు" అని ఇంగ్లీష్ తో పాటు తమిళంలో ప్రీ రికార్డెడ్ మెసేజ్ వస్తోందట!  అక్కడ రానా స్విచ్చేస్తే ఇక్కడ త్రిష స్విచ్చాఫ్ చేయడం ఏంటో.. ఈ కనెక్షన్లు.. ఈ రిలేషన్లు ఏంటో!