యువ న్యాయమూర్తి ఐశ్వర్య హఠాన్మరణం: తల్లికి కాఫీ ఇస్తూనే...

03:47 - January 6, 2019

 గుంటూరు జిల్లాలో నరసరావుపేట కోర్టు ప్రాంగణంలో ఒకటైన ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఐశ్వర్య ఊహించని విధంగా హఠాన్మరణం చెందారు. నిన్నటి ఉదయం తల్లికి కాఫీ ఇస్తూ ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఐశ్వర్య పట్టణ 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా పని చేస్తున్నారు. కోర్టు బంగళాలో నివసిస్తున్నారు. ఆమెకు ఇంకా పెళ్ళి కాలేదు. తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. 4వ తేదీన తన ఇంట్లో జారిపడిన ఆమె ఒకింత అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కాగా నిన్న ఉదయం ఒక్కసారిగా కుప్పకూలిపోగా ఆస్పత్రికి తరలించేలోపే ఐశ్వర్య కన్నుమూశారు. ఈ యువ న్యాయమూర్తి వయస్సు 25 సంవత్సరాలే కావటం ఇంకా భవిశ్యత్తు ఉన్న న్యాయమూర్తి ఇలా హఠాత్తుగా మరణించటంతో పలువురు లాయర్లు కూడా కంతతడి పెట్టారు.