మోడీకి షాక్‌: పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించిన ఒడిశా రచయిత్రి

14:59 - January 26, 2019

ఒడిశాకు చెందిన ప్రముఖ రచయిత్రి గీతా మెహతా మోడీ సర్కారు ప్రకటించిన పద్మ పురస్కారాపురస్కారాన్ని తిరస్కరించడం జరిగింది. మోడీ సర్కారు ప్రకటించిన పద్మశ్రీ పురస్కారం పొందిన 94 మందిలో ఈమె ఒకరు. ఇంతకూ ఆమె పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించటానికి కారణం చెబుతూ.. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం పద్మ పురస్కారాల్ని ప్రకటించినప్పటికీ.. ఇది అవార్డులు తీసుకోవటానికి సరైన సమయం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల వేళ.. మోడీ సర్కారు ప్రకటించిన పద్మ పురస్కారాల్ని తాను తీసుకోలేనని చెప్పారు. త్వరలో దేశంలో ఎన్నికలు జరగనున్నాయని.. అవార్డులు అందిస్తున్న టైమింగ్ అన్నది సమాజంలో తప్పుడు సందేశాల్ని అందిస్తుందని ఆమె చెప్పారు. తనకు కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తాను తిరస్కరిస్తున్నట్లుగా ఆమె ఒక ప్రెస్ నోట విడుదల చేశారు. సాహిత్యం.. విద్యా రంగాల్లో విశేషమైన సేవలు అందించిన ఆమె..పద్మశ్రీ దక్కటం న్యాయమే. కానీ.. రాజకీయ కారణాలు.. సమీకరణాలతో ఆమె తనకు ప్రకటించిన పురస్కారాన్ని రిజెక్ట్ చేసినట్లుగా భావిస్తున్నారు.