' మా ' ఎన్నికల అసలు నిజాలు భయటపెట్టిన హేమ...

15:50 - April 3, 2019

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల్లో వివాదాల గురించి తెలిసిందే. అయితే కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన నరేష్ ఏకపక్ష నిర్ణయాలతో కమిటీలో ఇతర సభ్యులంతా విభేధించారని నటి హేమ తెలిపారు. అందరినీ కలుపుకుపోకుండా నరేష్ ఏకపక్షంగా ఉండడాన్ని తప్పు పట్టారు. అంతేకాదు.. తాను వీటన్నిటినీ వ్యతిరేకిస్తోంది కాబట్టి తనను రౌడీ రెబల్ అని పిలుస్తున్నారని .. ఎలా పిలిచినా తనకు సమ్మతమేనని హేమ అన్నారు. 800 మంది మూవీ ఆర్టిస్టులు బావుండాలనే తాను ఓపెన్ గా ఉంటున్నానని హేమ వ్యాఖ్యానించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రమాణ స్వీకారాల వేళ తన నుంచి అధ్యక్షుడు నరేష్ మైక్ లాక్కోవడం తనకు అవమానమేనని అన్నారు. అతడి ఏకపక్ష విధానాల్ని ప్రశ్నించేందుకే మైక్ తీసుకున్నానని హేమ అన్నారు. అంతేకాదు మా ఎన్నికల్లో శివాజీ రాజాపై సీనియర్ నరేష్ గెలిచేందుకు జీవిత రాజశేఖర్ ఎంతో చేసినా ఆ ఇద్దరినీ అతడు పక్కన పెట్టారని బహిరంగ మీటింగ్ లో గొడవ తేల్చి చెప్పింది. వీటితోపాటు మా ఎన్నికల్లో శివాజీ రాజా ఓడిపోవడానికి కారణాల్ని  `మా` ఈసీ మెంబర్ .. ఇండిపెండెంట్ గా గెలిచిన నటి హేమ తాజా ఇంటర్వ్యూలో హేమ వెల్లడించారు.  `మా` ఎన్నికల చివరి నిమిషంలో 800 మంది సభ్యులకు జీవిత రాజశేఖర్ కుమార్తెలు (శివానీ శివాత్మిక) ఇద్దరూ ఫోన్లు చేసి తమ ప్యానెల్ కు ఓటేయాల్సిందిగా కోరారని .. దాని ప్రభావం పడిందని తెలిపారు. ప్రమాణ స్వీకారం విషయంలో శివాజీ రాజా వ్యతిరేకించినప్పుడు నరేష్ మీడియా ముందుకు వెళ్లాల్సిన పనేలేదని ఆ విషయాన్ని అతడు తమతో చర్చించనే లేదని హేమ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇంత జరుగుతున్న వేళ నరేష్ ఎలా ఈ వ్యతిరేకత నుంచిబయటపడి `మా`ను అభివృద్ధి వైపు నడిపిస్తారో అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.