"మార్పుకోసం" జైల్లోనే పుస్తక రాశాడట: జగన్ పై కత్తిదాడి నిందితుడు

12:28 - January 6, 2019

గతంలో పందేం కోడికి కట్టే కత్తితో వైయ్యెస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన శ్రీనివాస్ ఇప్పుడు మరో సంచలనం అయ్యాడు. ఎమిటా సంచలనం ఆశ్చర్య పోకండి. విశాఖ జైల్లో కూచుని "మార్పుకోసం" అని ఒక పుస్తకం  రాసాడట. మార్పుకోసం అంటే అదేదో టైంపాస్ లాంటిది అనుకుంటున్నారా ఆ పుస్తకంపేరే "మార్పుకోసం". తొనదరలోనే ఆపుస్తకాన్ని విడుదల చేసే ప్రయత్నాలూ చేస్తున్నాడట.  ఈ విషయమై ఇప్పటికే జడ్జికి, జైళ్ల శాఖ డీజీకి లేఖలు అందించినట్లుగా కూడా శ్రీనివాస రావు తరఫు న్యాయవాది చెప్పారని తెలుస్తోంది. అంతేకాదు, శ్రీనివాస రావు ఇప్పటికీ జగన్ అభిమానిగానే ఉన్నారని, వైసీపీ అధినేతకు, ఆయన కుటుంబ సభ్యులకు క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పాలని కూడా ఆశపడ్డాడట. 
                కాగా, జగన్ పైన దాడి కేసులో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేసును ఎన్ఐఏకు అప్పగించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వచ్చాయి. గత ఏడాది అక్టోబర్ 25న జరిగిన దాడి కేసుపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. శుక్రవారం దీనిపై విచారణ జరిగింది. జగన్‌పై దాడి కేసులో ఏపీ ప్రభుత్వం సరిగ్గా దర్యాప్తు చేయలేదని, ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించాలని వైసీపీ న్యాయవాదులు కోరారు.

కేసు విచారణ ఆలస్యమైతే న్యాయం జరగదన్నారు. దాడి జరిగిన ప్రదేశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి ఉంటుందని, కాబట్టి జాతీయ సంస్థలకు ఇవ్వొచ్చని భావించిన ధర్మాసనం.. కేసును ఎన్‌ఐఏకు అప్పగించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును దర్యాప్తు చేసి నిందితుడిని విచారించిందని, పూర్తి స్థాయిలో కేసు విచారణ జరిగిందని ఏపీ ప్రభుత్వం తరఫు లాయర్ వాదనలు వినిపించారు. కానీ హైకోర్టు కేసును ఎన్ఐఏకు అప్పగించింది. ఎన్ఐఏ అప్పుడే విచారణ ప్రారంభించింది. మరోవైపు అంతకుముందే ఎన్ఐఏకు కేంద్రం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెట్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది. కేసు నమోదును కేంద్రం హైకోర్టుకు తెలిపింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది.