మజీద్ కి మహిళలు రండి, కొబ్బరికాయలు కొట్టండి: మహల్ల ముస్లిం జమాత్ అధ్యక్షుడు

17:22 - January 9, 2019

శబరిమల ఆలయం లొకి మహిళలు ప్రవేశించారని ఇక్కడమసీదులోకీ వెళతాం అంటూ నాయనార్ మసీదులో ప్రవేశించ బోతుంటే పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘట ఉద్దేశించి "ఎరుమిలి నాయనార్ మసీదులోకి మహిళల ప్రవేశంపై ఎలాంటి ఆంక్షలు లేవ"ని ఆ ప్రాంత మహల్ల ముస్లిం జమాత్ అధ్యక్షుడు పీహెచ్ షాజహాన్ ప్రకటించారు. మహిళలను అనుమతించడం లేదంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. అయ్యప్ప భక్తులతో కిటకిటలాడే ఈ మసీదు వావర్ మసీదుగా ప్రసిద్ధి. శబరిమలకు వెళ్లే భక్తులు తప్పని సరిగా దర్శించుకుంటుంటారు. 
 
స్థానికులు చెప్తోన్న వివ‌రాల ప్ర‌కారం.. అయ్యప్ప స్వామి బాల్యంలో వావర్ అనే ముస్లిం యువకుడితో స్నేహం చేశారు. శ‌బ‌రిమ‌ల‌కు 60 కిలోమీట‌ర్ల దూరంలో కొట్టాయం జిల్లాలో ఉన్న పురాతన ఎరుమెల్లి నాయనార్ జుమ్మా మసీద్‌ను వావ‌ర్ పేరుమీదే నిర్మించార‌ని చెప్తుంటారు. అందుకే ఈ మ‌సీదును వావర్ పల్లి మసీద్ అని పిలుస్తుంటారు. కేర‌ళ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌కు చెందిన ల‌క్ష‌ల మంది భ‌క్తులు అయ్యప్ప మండల దీక్ష ముగింపు యాత్ర‌లో శ‌బ‌రిమ‌ల కొండ ఎక్కేముందు వావర్‌పల్లి మసీదును సంద‌ర్శిస్తారు. ఆ స‌మ‌యంలో ముస్లింలు మసీదులోని ప్రార్థ‌నా మందిరంలో పార్థనలు చేస్తుంటే.. అయ్యప్ప భక్తులు మసీదు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, కొబ్బరికాయలు కొడ‌తారు. స్వామియే శరణం అయ్యప్పా అంటూ స్వామిని తలుచకుంటారు. ఇదొక అద్భుత దృశ్యం. అయ్య‌ప్ప భ‌క్తులు పార్థనా మందిరంలోకి ప్ర‌వేశించ‌ర‌ని, మసీదు చట్టూ ప్ర‌దక్షిణలు చేసి కొబ్బరికాయలు కొడుతుంటారని మ‌సీదు వావర్‌పల్లి మసీదు కమిటీ సంయుక్త కార్యదర్శి హకీమ్ చెప్తున్నారు. ముస్లింలు ప్రార్థనా మందిరంలో నమాజ్ చదువుతుంటే.. బయట అయ్యప్ప భక్తులు పదక్షిణలు చేస్తున్న దృశ్యం అద్భుతంగా ఉంటుంద‌న్నారు. అయ్యప్ప-వావర్ స్నేహం హిందూ-ముస్లిం భాయీ భాయీ సంస్కృతికి ఒక ప్ర‌తీక‌గా అభివర్ణించారు. కేరళ సంస్కృతిలో భాగమైపోయిన లౌకికవాదానికి ఒక గొప్ప ఉదాహరణగా పేర్కొన్నారు. అయ్యప్ప మాలవిరమణకు వచ్చే భక్తుల కోసం మసీదు ప్రాంగణంలో పత్యేక ఏర్పాట్లు చేస్తామ‌ని, పార్కింగ్ సౌకర్యంతోపాటు విరి పేరుతో విశ్రాంతి తీసుకునేందుకు మంచాలు ఏర్పాటు చేస్తామ‌న్నారు. అంతేకాదు.. మండల దీక్షలు పూర్తయిన త‌ర్వాత కొట్టాయం జిల్లాలో అయ్యప్ప భక్తులు పెట్టాతుళాల్ పేరుతో ప్ర‌త్యేక నృత్యపదర్శన చేస్తుంటారు. వావర్‌పల్లి మసీదులో చందనకుడం పేరుతో ఈ కార్యకమాన్ని నిర్వహిస్తుంటారు. వందలాది మంది అయ్య‌ప్ప భక్తులు ఈ నృత్య పదర్శనలో పాల్గొంటారు.

అయితే శబరిమల వివాదం నేపథ్యం లో మసీదులోకి ప్రవేశిస్తున్న ముగ్గురు మహిళలను కొళింజంపర పోలీసులు మంగళవారం అరెస్ట్ చేయడంతో ఈ వివాదం తలెత్తింది. మహిళలను తమిళనాడులోని హిందూ మక్కల్ కట్చి సంస్థకు చెందిన వారిగా గుర్తించారు. దీనిపై స్పందనగానే షాజహాన్ తాజా ప్రకటన విడుదల చేశారు. తమ మసీదులోకి ఎవరైనా ప్రవేశించొచ్చని తెలిపారు. ముఖ్యంగా మహిళలపై ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. హిందూ దేవాలయాలలాగే తమ మసీదులో కూడా కొబ్బరి కాయలు కొట్టొచ్చని తెలిపారు. హిందూ, ముస్లిం భేదం లేకుండా అందరినీ ఆహ్వానిస్తామన్నారు.