బెనిఫిట్ షోలు లేవు: తీవ్ర నిరాశలో బాలయ్య అభిమానులు

13:41 - January 6, 2019

బాలయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా "కథానాయకుడు" కి కష్టాలు వచ్చినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమాకి బెనిఫిట్ షోలు వెయ్యటానికి వీల్లేదంటూ తెలంగాణా ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో బాలయ్య, ఎన్టీఆర్ అభిమాలు తీవ్ర నిరాశకు గురయ్యారు.  అభిమానులను అదుపు చేయలేకపోవడం, అనవసమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం వంటి సమస్యల కారణంగా బెనిఫిట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని చెబుతున్నప్పటికీ కథానాయకుడు సినిమా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోవడం వెనక రాజకీయ కారణాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. 


                            అయితే గతంలో బాలకీ తెలంగాణా ముఖ్యమంత్రి వర్గానికి సన్నిహిత సంబందాలే ఉండేవి. బాలయ్య కేసీఆర్ ని కలిసి మరీ గౌతమీ పుత్ర శాతకర్ణి బెనిఫిట్ షోలకు అనుమతి కోరగానే, ఆ సినిమా బెనిఫిట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో అనుమతి ఇచ్చింది. అంతేకాదు ఆ సినిమాకి గానూ పన్ను మినహాయింపు సౌకర్యం కూడా కల్పించారు. దానిపై తెలంగాణవాదుల నుంచి కేసీఆర్ విమర్శలు కూడా ఎదుర్కున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకు బాలకృష్ణకు తెలంగాణ పెద్దలతో సన్నిహిత సంబంధాలే కొనసాగాయి.  


అయితే ఈ సారి మాత్రం ఆ అవకాశం లేదు. మిగతా అన్ని సినిమాల్లాగే ఈ సినిమాని కూడా మామూలుగానే రోజుకు నాలుగు షోలు మాత్రమే వేసుకోవాలి.  ఏ విధమైన ప్రీమియర్ షోలు, పెయిడ్ ప్రివ్యూలు లేవు. అభిమానులను అదుపు చేయలేకపోవడం, అనవసరమైన ట్రాఫిక్ ఇష్యూలు వస్తుండడంతో బెనిఫిట్ షోల ప్రస్తావన రానివ్వడం లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ఒక్క సినిమాకే కాదు ఈ మధ్యకాలంలో విడుదలైన చాలా సినిమాలకు తెలంగాణా రాష్ట్రంలో స్పెషల్ షో పర్మిషన్ దొరకలేదు. అయితే బాలయ్య తన పరిచయంతో ఈ సినిమా వరకూ అనుమతి సంపాదిస్తడనే అనుకున్నారు అంతా. 

అయితే ఆంధ్రాలో మాత్రం ఉదయం 5 గంటల షోలు ఉన్నాయి. అలాగే జనవరి 8న యుఎస్ లో ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఇప్పటికే చిత్ర యూనిట్ కథానాయకుడు ప్రమోషన్స్ వేగం పెంచేసింది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈబయోపిక్ లో రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను పిబ్రవరి 7న విడుదల చేయనున్నారు.