ప్రభాస్‌ కూడా వాల్లలాగే ప్లాన్‌ చేస్తున్నాడట!.

16:42 - January 26, 2019

బాహుబలి తర్వాత ఎవరికి అంత ఈజీగా అందలేనంత ఎత్తుకు చేరుకున్న రెబెల్ స్టార్ ప్రభాస్ సినిమా కోసం ఎప్పటిలాగే అభిమానులు రెండేళ్ళ ఎదురుచూపులకు ఫిక్స్ అయిపోయారు. దానికి తగ్గట్టే సాహో కూడా బాహుబలి 2 తర్వాత అంతే గ్యాప్ తీసుకుని ఆగస్ట్ 15న రాబోతోంది. రెండు వందల కోట్ల దాకా బడ్జెట్ పెడుతున్న సాహో మీద అంచనాలు మాములుగా లేవు. అయితే దీని నిర్మాణ సంస్థ యువితో ప్రభాస్ కున్న సత్సంబంధాలు తెలిసిందే. బాహుబలి తర్వాత తనతో నిర్మించే ఏ సినిమాకైనా యువికి భాగస్వామ్యం ఉండాలన్న కండీషన్ మీదే తన దగ్గరకు వచ్చిన దర్శక నిర్మాతలతో చర్చలు జరుపుతున్నాడట. అయితే అది ఎంత శాతం అనేది తెలియదు కాని నిజమే అని వినికిడి. తన ప్రాణ స్నేహితులు దానికి సారధులుగా ఉండటం అందులో డార్లింగ్ కూ పార్టనర్ షిప్ ఉందన్నది బయటికి చెప్పకపోయినా టాక్ అయితే ఎప్పటి నుంచో ఉంది. అందుకే తన బెస్ట్ ఫ్రెండ్స్ గోపీచంద్ కు జిల్ శర్వానంద్ కు రన్ రాజా రన్ అదే బ్యానర్ లో తీయించి మంచి బ్రేక్ వచ్చేలా చేసాడు. అందుకే యువి అంటే ప్రభాస్ హోం బ్యానర్ లాగే ఫీలవుతారు ఫ్యాన్స్. సాహో తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు పెదనాన్న కృష్ణంరాజు బ్యానర్ గోపికృష్ణ మూవీస్ తో పాటు యువిని కూడా పార్టనర్ గా చేర్చిన సంగతి తెలిసిందే. ఏదైతేనెం ప్రభాస్ కూడా మహేష్ బాబు-సల్మాన్ ఖాన్-చిరంజీవిల తరహాలో పక్కా బిజినెస్ మైండ్ తో మంచి రిటర్న్స్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడట. సాహో విడుదలైన నాలుగైదు నెలలకే ఎక్కువ గ్యాప్ లేకుండా ప్రభాస్ సినిమాలు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారట యువి టీం.