నేను అభిమానులని కొట్టేది ఇందుకే: ఆ ప్రవర్తనకి కారణం చెప్పిన బాలయ్య

04:59 - January 7, 2019

ఈ రెండు మూడేళ్లలో బాలకృష్ణ సినిమాల్లో విలన్లని కొట్టినంత మామూలుగా అభిమానుల మీద చెయ్యి చేసుకోవటం లోనూ ప్రవర్తించారు. దాదాపుగా అభిమానులని కొట్టే హీరో అన్నత అపప్రద వచ్చిపడింది. అయితే ఇంతగా వార్తల్లోకి వచ్చే బాలయ్యని మాత్రం సున్నితమనస్కుడు అనే అంటారు దగ్గరగా తెలిసిన వాళ్ళంతా. అయితే మరి ఎందుకని అంత పెద్ద హీరో అలా అసహనానికి గురి అవుతున్నారు? దగ్గరగా వచ్చిన అభిమానుల మీద ఎందుకంత కోపం ప్రదర్శిస్తున్నారు? అన్న అనుమానం రాక మానదు. అయితే ఈ అనుమానాలన్నిటికీ తానే స్వయంగా సమాధానం చెప్పారు బాలయ్య. 


 "నేను అభిమానుల్ని ఎప్పుడూ కొట్టను. నాకోసం నా ఫ్యాన్స్ ఎన్నోవందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తారు. నన్ను జస్ట్ అలా చూసినా చాలు అని అనుకుంటారు. మరి నాకోసం వచ్చేవారి కోసం నేను ఏదైనా చెయ్యాలి కదా. అందుకే.. వారిని పిలిచి మరి ఫోటోలకు ఫోజులిస్తుంటాను. వారి భుజం పై చెయ్యి వేసి నవ్వుతూ ఫోజిస్తే.. వారికి నాకు ఎంత ఆనందం. అసలు ఇండియాలో ఫ్యాన్స్ తో అతి ఎక్కువు ఫోటోలు దిగేది నేనే. ఒక్కోసారి రెండు మూడు గంటలు నిలబడే అభిమానులతో ఫోటోలు దిగుతాను. అలాంటి నేను అభిమానుల్ని ఎందుకు కొడతాను?

అయితే కొంతమంది మాత్రం ఫోటోలకు ఫోజులిచ్చే టైమ్ లో ఓవరాక్షన్ చేస్తుంటారు. మీదకు తోసుకుంటూ వస్తుంటారు. ఎవరైనా ప్రముఖుడు మాట్లాడుతుంటే అరుస్తారు. అది తప్పుకదా. అలాంటప్పుడు మాత్రం కోపం వస్తుంది . ఆటోమేటిగ్గా చెయ్యి లేస్తుంది. అంతే తప్ప నా అభిమానుల్ని నేను ఎప్పుడూ కొట్టను" అంటూ తప్పని సరి పరిస్థితుల్లో తన అసహనం మరీ పెరిగిపోతే అలా కటువుగా ఉంతాను తప్ప కావాలని గర్వంతో చేసే పని కాదు అని వివరణ ఇచ్చారు. అయినా బాలయ్య అభిమానులు ఆయన చేతి దెబ్బ తిన్నందుకే సంతోషంగా ఫీల్ అవుతారని గతం లో బాలయ్యే చెప్పారు కదా. ఆయన అభిమానులకే లేని బాధ మనకు మాత్రం ఎందుకూ..