నాన్నకి క్యాన్సర్, లవ్యూడాడీ : బాలీవుడ్ హీరో హృతిక్ ఎమోషనల్ పోస్ట్

16:33 - January 8, 2019

కొన్నాళ్ళుగా బాలీవుడ్ వరుసగా క్యాన్సర్ బారిన పడుతోంది. బాలీవుడ్ సినీ ప్రముఖులంతా వరుసగా ఏదో ఒక క్యాన్సర్ బారిన  పడ్డట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇర్ఫాన్‌ ఖాన్‌, సోనాలి బ్రిందేల ఆరోగ్యానికి సంబంధించిన వార్తల నుంచి తెరుకోక ముందే రాకేష్‌ రోషన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు తెలియటంతో అభిమానులు షాక్‌ అయ్యారు.బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని రాకేష్ తనయుడు హీరో హృతిక్‌ రోషన్‌ స్వయంగా బయటపెట్టి అభిమానులకు షాక్‌ ఇచ్చాడు. ఈ రోజు(08-01-19) ఉదయం తండ్రి రాకేష్‌ రోషన్‌తో కలిసి జిమ్‌లో దిగిన ఫోటోను తన సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్‌ చేసిన హృతిక్‌ తన తండ్రి క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టుగా వెల్లడించాడు. 

 సోషల్ మీడియాలో తన తండ్రితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఈ చేదు వాస్తవాన్ని అతను తెలిపాడు. రాకేష్ రోషన్ మొదటి దశలో ఉన్న గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని, మంగళవారం నుంచే సర్జరీలు జరగనున్నట్లు హృతిక్ చెప్పాడు. క్యాన్సర్ అని తెలిసినా తన తండ్రి ఆత్మైస్థెర్యం ఏమాత్రం దెబ్బ తినలేదని, అలాంటి లీడర్ తమ కుటుంబంలో ఉన్నందుకు తాము అదృష్టవంతులమని అన్నాడు. 

ఈ రోజు ఉదయాన్నే నాన్నతో ఫోటో దిగాలని అనిపించింది. ఆయన శస్త్ర చికిత్స రోజు కూడా జిమ్ కు రాకుండా ఉండరు. నాన్న కొన్ని వారాలుగా గొంతు క్యాన్సర్ తో భాదపడుతున్నారు. ఆయన చాలా ధృడమైన వ్యక్తి. క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేస్తూనే సంతోషంగా ఉన్నారు. మా కుటుంబానికి ఆయన లాంటి లీడర్ ఉండడం మా అదృష్టం.. లవ్యూ డాడీ అంటూ హృతిక్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.


గొంతు క్యాన్సర్లలో ఒకటైన స్కామస్ సెల్ కార్సినోమాతో రాకేష్ రోషన్ బాధపడుతున్నాడు. రాకేష్ రోషన్ 1970లో వచ్చిన ఘర్ ఘర్ కీ కహానీ సినిమాతో కెరీర్ మొదలుపెట్టాడు. బునియాద్, కామ్‌చోర్, ఖూబ్‌సూరత్‌లాంటి సినిమాలతో ఫేమస్ అయ్యాడు. 1987లో ఖుద్‌గర్జ్ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. షారుక్‌తో కలిసి కోయ్‌లా, కరణ్ అర్జున్‌లాంటి హిట్ మూవీస్ తీశాడు. 2000లో తన తనయుడు హృతిక్‌ను కహో నా ప్యార్ హై మూవీతో హీరోగా పరిచయం చేశాడు. కోయ్ మిల్ గయా, క్రిష్ సిరీస్‌లో ఈ తండ్రీ తనయులు కలిసి పని చేశారు.