నల్ల ద్రాక్ష వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

14:15 - January 18, 2019

- నల్ల ద్రాక్షలోని యాంటీయాక్సిడెంట్లు గుండెను కాపాడతాయి. రోజూ అరకప్పు ద్రాక్షను తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. 

- ద్రాక్షలో ఉండే టిరోస్టిల్‌బీన్‌ అనే పదార్థం రక్తంలో కొవ్వు మోతాదును తగ్గించి రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది.

- ద్రాక్షలో ఉండే రిస్‌ అనే పాలీఫినాల్‌ మతిమరుపు రాకుండా చేసి మెదడు చురుగ్గా ఉండేలా చేస్తుంది.

- ఉబ్బసం, అజీర్తి, మలబద్ధకం, డయేరియా వంటి వ్యాధులు, దంత సంబంధ వ్యాధులను అరికట్టడంలో ద్రాక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది.

- పరగడుపున తీసుకునే చిక్కని ద్రాక్ష రసం మైగ్రేన్‌ తలనొప్పిని తగ్గిస్తుంది.

- ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి వైరల్‌ జ్వరాలు రాకుండా అడ్డుకుంటాయి.

- పెద్దవాళ్ల కంటిలో శుక్లాలు ఏర్పడి చూపు మందగిస్తుంది. రోజూ ద్రాక్షను తీసుకుంటే శుక్లాలు ఏర్పడే అవకాశాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. పిల్లల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.