ధారుణ వ్యాపారం: ఏకంగా ఫేస్ బుక్ లోనే మొదలు పెట్టారు

15:37 - January 8, 2019

చట్టాలు చట్టలుగానే ఉంటున్నాయి. జరిగే దారుణాలు జరుగుతూనే ఉన్నాయి వన్య ప్రాణులను కాపాడేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా. అటవీ జీవుల వ్యాపారం మాత్రం ఆగటం లేదు. ఒకప్పుడు దుప్పి, జింకా, నెమలి వంటి జంతువుల మాంసం అక్రమంగా ఆమే ముఠాలు ఉండేవి, ఇక పులుల వంటి జంతువులని వటి చర్మాల కోసం చంపటమూ విన్నాం. కానీ కొన్ని సంవత్సరాల కిందనుంచీ ఒక కొత్త తరహా వ్యాపారం మొదలయ్యింది. రెండు తలల పాముగా పిలవబడే ( రెడ్ సాండ్ బోవా ) ఇంట్లో ఉంతే అదృష్టం అని చెబుతూ వాటిని అక్రమంగా తరలించే వారు. అటవీ, పోలీసు అధికారులు కాస్త కఠినంగా వ్యవహరించటం మొదలయ్యాక ఆ తరహా వ్యాపారం తగ్గు ముఖం పట్టింది... 


అయితే తాజాగా ఇప్పుడు కొండచిలువనీ, పాములనూ అమ్ముతాం అంటూ కొత్త "బ్యాచ్" బయలుదేరింది. ఒక కొండచిలివని, కొన్ని రకాల పాములనూ అమ్ముతామంటూ మేడ్చల్ జిల్లా చౌదర్‌గూడ గ్రామంలో చోటు చేసుకుంది. వెంకటాద్రి టౌన్‌షిప్‌లో శరణ్ మోసెస్ అనే యువకుడు నెల రోజుల నుంచి ఓ ఇంట్లో కొండచిలువ,  బ్రోంజ్ బ్యాక్ స్నేక్‌లను దాచి వుంచాడు. అదే ప్రాంతానికి చెందిన అతని స్నేహితుడు ప్రవీణ్ ఇటీవల వాటితో కొన్ని ఫోటోలు దిగి ఏకంగా వాటిని ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో షేర్ చేసి అమ్మటానికి అంటూ పోస్ట్ చేసాడు.

దీనిపై పక్కా సమాచారం అందుకున్న అధికారులు ఆ ఇంటిపై దాడులు చేసి వారు పాములను అక్రమంగా అమ్ముతున్నట్టు గుర్తించారు. రెండు పాములను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం కేసు నమోదు చేశారు అధికారులు. ఇద్దరినీ రంగారెడ్డి మెట్రో పాలిటిన్ జడ్జి ఎదుట ఇద్దరు హాజరు పరిచారు. ఈ అటవీ చట్టం ప్రకారం కొండ చిలువలను అక్రమంగా నిర్బంధించడం నేరం. అందుకు 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10,000వేల జరిమాన విధించే అవకాశం ఉంది.