దేవరకొండ క్రేజ్‌: ఫెయిల్‌ అయిన సినిమా కూడా...

16:15 - February 2, 2019

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా ప్రస్తుతం విజయ్ దేవరకొండకు మంచి క్రేజ్ ఉంది. విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' చిత్రం తమిళ ప్రేక్షకుల ముందుకు తెలుగు వర్షన్ తోనే వెళ్లింది. అక్కడ మంచి వసూళ్లను దక్కించుకుంది. తెలుగులో 'అర్జున్ రెడ్డి' చిత్రం అక్కడ మంచి వసూళ్లు సాధించడంతో ప్రస్తుతం అక్కడ వర్మ అనే టైటిల్ తో అర్జున్ రెడ్డిని రీమేక్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్ ఆరంభంలో నటించిన 'ద్వారక' చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఆ సినిమా పెద్దగా కలెక్షన్స్ ను కూడా రాబట్టలేక పోయింది. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ ను ఉపయోగించుకునేందుకు 'ద్వారక' సినిమా ను తమిళంలో డబ్ చేసి విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తమిళంలో కూడా అర్జున్ రెడ్డి బాగా సందడి చేసింది. దాంతో టైటిల్ అక్కడి వారికి బాగా రిజిస్ట్రర్ అయ్యింది. ఆ కారణంగానే ద్వారక చిత్రాన్ని తమిళంలో అర్జున్ రెడ్డి టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లబోతున్నారు. విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ ను తమిళ నిర్మాతలు ఇలా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.దీన్ని బట్టి విజయ్ దేవరకొండకు అక్కడ కూడా ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమాతో పాటు ఇంకా రెండు మూడు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి.