త్రివిక్రమ్‌ గారిని అందుకే కలిశాను: ఆది

14:39 - February 20, 2019

జబర్దస్త్ కారణంగా ఎంతో మంది కమెడియన్స్ కు మంచి గుర్తింపు దక్కింది. అయితే ఆదికి మాత్రం అంతకు మించి అందరిని మించి గుర్తింపు దక్కిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆది వెండితెరపై కూడా నటించాడు. ఆది నటించిన సినిమాలో ఎక్కువ తన పాత్రకు తానే డైలాగ్స్ రాసుకుంటాడని అంటూ ఉంటారు. ఇదిలా వుంటే... కొన్ని రోజుల క్రితం త్రివిక్రమ్ ను ఆది కలిశాడు. దాంతో త్రివిక్రమ్ తన తదుపరి చిత్రంకు డైలాగ్స్ రాసేందుకు ఆదికి ఛాన్స్ ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషియాలపై తాజాగా ఆది స్పందించాడు. వివరాల్లోకి వెలితే... త్రివిక్రమ్ గారిపై తనకు చాలా అభిమానం ఉంది ఆ అభిమానంతో ఆయన్ను మూడు సార్లు కలవడం జరిగింది. అభిమానంతోనే కలిశాను తప్ప అంతకు మించి మరేం లేదు. ఆయన సినిమాలకు మాటలు రాసేంతటి వ్యక్తిని నేను కాదు అంటూ ఆది చెప్పుకొచ్చాడు. త్రివిక్రమ్ గారు ఆయన తీసే సినిమాలకు కథ - మాటలు సొంతంగా రాసుకుంటారు. ఆయనకు మరెవ్వరి అవసరం లేదని ఆది అన్నారు. నాతో మాటలు రాయించుకోవాల్సిన అవసరం ఆయనకు లేదని ఆది అన్నాడు ఆది.