తొలి తీర్పు వెలువరించిన ఏపీ హైకోర్ట్: అమరావతిలో తొలిసారి

14:56 - January 5, 2019

ఇప్పటివరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడిగా ఉన్న హైకోర్టు ఇప్పుడు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వేరవ్వటంతో రెండుగ విడిపోయింది. ఈ సంవత్సరం తొలిరోజునుంచే ఆంధ్రప్రదేశ్ కి తరలించ బడ్డ ఏపీ హైకోర్టు.అమరావతికేంద్రంగా కార్యకలాపాలను మొదలు పెట్టింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో జ‌న‌వ‌రి 1వ తేదీని అపాయింటెడ్‌ డే గా నిర్ణ‌యించి, హైకోర్టు విభ‌జ‌నకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. 

దీంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జ‌స్టిస్‌గా ప్ర‌వీణ్ కుమార్‌, ఆయనతో పాటు మ‌రో 13 మంది న్యాయ‌మూర్తులు బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఇప్పటికి తాత్కాలిక భవంతిలోనే కొనసాగుతున్నప్పటికి, ఈ నెలాఖరు లోగా ప్రత్యేక భవంతిని అందుబాటులోకి తెస్తామంటున్నారు.  అమరావతిలో కేసుల విచారణను చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అమరావతి రాజధానికి తరలివెల్లిన తర్వాత ఏపీ హైకోర్టు తన తొలి తీర్పును శుక్రవారం వెలువరించింది. 

   హమాలీల  సంఘం కోర్టులో దాఖలు చేసిన అప్పీల్ ను ఏపీ హైకోర్టు కొట్టివేస్తూ తొలి తీర్పును ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ బేవరేజీ కార్పొరేషన్(ఏపీబీసీఎల్) మద్యం గౌడన్లలో 40 మంది హమాలీలను అనుమతించాలని హమాలీ సంఘం నాయకులు హైకోర్టులో అప్పీల్ చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుల్లో జోక్యం చేసుకోవడానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది.

నిజానికి విచారణ తొలి రోజు కేసుల విచార‌ణ జ‌ర‌గ‌కుండానే ప్ర‌ధాన న్యాయ‌మూర్తి వాటిని వాయిదా వేశారు. ఒక్కొక్కటిగా ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టి తొలి తీర్పుని ఈరోజు వెలువరించారు. హైకోర్టుకోసం అందుబాటులోకి రానున్న కొత్త భవంతి నమూనా చిత్రాలుగా చెప్పబడుతున్న వాటిల్లో ఒకదానిని మీరిక్కడ చూడవచ్చు.