జనసేనకు విరాళాలిచ్చేందుకు హీరోల క్యూ

14:20 - December 25, 2018

అజ్ఞాతవాసి తరవాత ఇక సినిమాలు చేయనని ప్రకటించి పూర్తిగా జనసేన రాజకీయ వ్యవహారాల్లో బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్ కు ఇప్పటిదాకా టాలీవుడ్ పెద్దగా సపోర్ట్ చేయలేదు. అయితే ఇప్పుడు కొంచెం సినీ ఇండిస్టీలోనూ, అభిమానుల్లోనూ జోష్‌ వచ్చినట్లు కనిపిస్తుంది.అసలు విషియంలోకి వెల్తే...నిన్న వరుణ్ తేజ్ బాబాయ్ పార్టీకి చందాగా కోటి రూపాయల విరాళం ఇవ్వడం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. నాగబాబు సైతం పాతిక లక్షలు ఇవ్వడంతో ఇది ఇంకాస్త వైరల్ అయ్యింది. పవన్ ట్విట్టర్ లో స్పందిస్తూ ఇద్దరికీ థాంక్స్ చెబుతూ త్వరలో వ్యక్తిగతంగా వచ్చి కలుస్తానని చెప్పడం మెగా ఫ్యాన్స్ లో మంచి జోష్ ఇచ్చింది. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ కాకుండా యూత్ హీరోలు కొందరు ఈ విరాళాల బాట పట్టబోతున్నట్టు సమాచారం. యూత్ లో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉన్న ఓ యంగ్ హీరో భారీ మొత్తాన్నే సమీకరించినట్టు తెలిసింది. ఇతని కొత్త సినిమా డిసెంబర్ చివరి వారం విడుదల నుంచి పోస్ట్ పోన్ అయిన నేపధ్యంలో జనసేన విరాళం గురించే కొంత సమయం కేటాయించి త్వరలోనే పవన్ ఆఫీస్ లో కలిసే ప్లాన్ లో ఉన్నాడట. ఇదే ఏడాది పాతిక సినిమాలు పూర్తి చేసుకున్న మరో పవన్ డై హార్డ్ ఫ్యాన్ అయిన మరో యంగ్ హీరో పవన్ కోసం వామ్మో అనిపించే అమౌంట్ ని రెడీ చేసాడట. ఇటీవలే హీరోగా ఓ ట్రయిల్ వేసిన కమెడియన్ సైతం ఇదే దారిలో ఉన్నట్టు సమాచారం. మొత్తానికి పవన్ కు విరాళాలు ఇచ్చేందుకు హీరోల క్యు కొనసాగేలా ఉంది.