చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

13:28 - December 28, 2018

మిగతా కాలాల కన్నా చలికాలంలో చర్మ సంబంధమైన సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా అందానికి సంబంధించి మహిళలు చికాకు పడకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాలంటున్నారు డైటీషియన్స్‌, కాస్మొటిక్‌ ఫిజీషియన్స్‌. 

- విటమిన్‌ 'సి' లభించే స్ట్రాబెర్రీస్‌, నిమ్మజాతి పళ్లు, బ్రొకోలి వంటివి తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉండే విటమిన్‌ 'ఏ', 'ఇ' కోసం చిలకడదుంప, క్యారెట్లను విరివిగా వాడాలి. 

- ఆహారంలో తప్పకుండా కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. రోజుకు ఒకసారైనా ఏదో ఒక జ్యూస్‌ తాగాలి. ఇలా చేయడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వీటితో పాటు కలబంద జ్యూస్‌, గోధుమ గడ్డి, దానిమ్మ, నీళ్లు తాగడం వల్ల కూడా చర్మం మృదువుగా ఉంటుంది. 

- రెగ్యులర్‌ ఫేస్‌వాస్‌లు, క్లిన్సర్లు కాకుండా, సల్ఫేట్స్‌ లేని నాన్‌ ఫోమింగ్‌ క్లిన్సర్లు వాడాలి. వేసవి కన్నా చలికాలంలోనే సూర్య కిరణాలు తీక్షణంగా ఉంటాయి కాబట్టి కనీసం 30 ఎస్‌పిఎఫ్‌, యువిఎ రక్షణ ఉన్న సన్‌స్క్రీన్‌ లోషన్లను చర్మానికి రాసుకుంటే నల్లబడకుండా ఉంటుంది.

- ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ చర్మాన్ని ఇతర సమస్య నుండి కాపాడతాయి. సోయాబీన్స్‌, వాల్‌నట్స్‌లలో ఇది అధికంగా లభిస్తుంది.