గ్యాంగ్‌లీడర్‌ హిట్‌కు ఉన్న ఆ మూడు రీజన్స్‌...వివిఆర్‌లో ఉన్నాయా?

11:07 - December 29, 2018

వినయ విధేయ రామ ఆడియో ఫంక్షన్ అద్భుతంగా జరిగింది.  అయితే.. కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్… ఇద్దరూ కలిసి ఒక మాట అన్నారు. ఒక సినిమా ప్రస్తావన పదే పదే తెచ్చాు. అదే గ్యాంగ్ లీడర్. వినయ విధేయ రామ సినిమా గ్యాంగ్ లీడర్ లా ఉంటుందని.  గ్యాంగ్‌లీడర్‌ హిట్‌కు ముఖ్యంగా మూడు రీజన్స్‌ వున్నాయి.విజయబాపినీడు దర్శకత్వం వహించిన  గ్యాంగ్ లీడర్  సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్కువ. గ్యాంగ్ లీడర్ సినిమా హిట్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది పాటలు. మెగాస్టార్ బప్పీలహరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్టే. అందుకే.. ఈ సినిమాలోని వానా వానా వెల్లువాయే పాటని రచ్చసినిమాలో రీమిక్స్ చేసుకున్నాడు చరణ్. ఇక గ్యాంగ్ లీడర్ హిట్ కు రెండో కారణం మెగాస్టార్ పర్ ఫార్మెన్స్. ఇందులో చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉందో అనే డైలాగ్ సూపర్ హిట్ అయ్యింది. మెగాస్టార్ కు చాలా రఫ్ లుక్ తెచ్చిపెట్టింది. ముచ్చటగా మూడో రీజన్.. గ్యాంగ్ లీడర్ సినిమా ముందు మెగాస్టార్ కు సరైన హిట్ లేదు. స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ రాజా విక్రమార్క సినిమాలతో ఫ్లాపులు చవిచూశాడు. దీంతో… మంచి సినిమా కోసం అభిమానులు వెయిట్ చెయ్యడం మొదలుపెట్టారు. అదే టైమ్ లో గ్యాంగ్ లీడర్ రిలీజ్ అయ్యింది. సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు వీవీఆర్ లో కూడా ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది. సినిమా నిండా జనం ఉన్నారు. కానీ బప్పీలహరి లాంటి మ్యూజిక్ మ్యాజిక్ ఉందా అంటే డౌటే. దేవిశ్రీ పాటలు సోసోగా ఉన్నాయి. బోయపాటి రేంజ్ యాక్షన్ సీన్స్ అన్నీ గతంలోనే మనం చూసేశాం. ఇప్పుడు అంతకుమించి తీస్తేనే వీవీఆర్ అభిమానులకు కిక్ ఇస్తుంది. గ్యాంగ్ లీడర్ రేంజ్ లో హిట్ అవుతుంది. మరి వినయ విధేయ రామ గ్యాంగ్ లీడర్ రేంజ్ లో హిట్ అవుతందో లేదో తెలియాలంటే.. సంక్రాంతి వరకు ఆగాల్సిందే.