కొడుకు కోసం ఏపీని నాశనం చేస్తున్నాడు: చంద్రబాబు పై మోడీ విమర్షల వర్షం   

05:04 - January 7, 2019

ప్రధాని మోడీ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల దృష్ట్యా ఆంద్రప్రదేశ్ మీద కూడా దృష్టి పెట్టారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ఐదు లోక్ సభ నియోజకవర్గాల బూత్ స్థాయి కార్యకర్తలు నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ మాట్లాడారు. అనంతపురం, కడప, కర్నూలు, నరసారావుపేట, తిరుపతి నియోజకవర్గాల పరిధిలోని కార్యకర్తలతో మాట్లాడిన మోడీ చండ్రబాబు మీద నేరుగా విమర్షలని సంధిస్తూ కార్యకర్తలకు వ్యూహాన్ని వివరించారు. 

తన "సన్" రైజ్ కోసం ఏపీకి బాబు సూర్యాస్తమయం వంటి పరిస్థితిని తీసుకువస్తున్నారని మోడీ లోకేష్ గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ ఏపీ సీయం చంద్రబాబూ నాయుడిని ఉద్దేశించి బహిరంగంగానే వెటకారం చేశారు. కొడుకు లోకేష్ ని రాజకీయాల్లో నిలబెట్టటానికి రాష్ట్రానికి అన్యాయం చేయటానికి సైతం వెనుకాడటం లేదని వ్యాఖ్యానించిన మోడీ. చంద్రబాబు తన కొడుకు రాజకీయ భవిష్యత్ కోసమే  ఆలోచిస్తూ ఏపీలోని ఇతర పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించడం లేదని  మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో ఎంత అవినీతి జరుగుతున్నా కేవలం కొడుకు కోసమే చంద్రబాబు మౌనంగా ఉంటున్నారని తీవ్రంగానే విమర్షించారు. 

అంతే కాదు వీడియో కాన్ఫరెన్స్ లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ని వెన్ను పోటుపొడిచి రెండుసార్లు ఎన్టీఆర్ ను మోసం చేసారని తెలుగు ప్రజలకు అసలైన గర్వకారణమైన  ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచినట్టుగానే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు కూడా వెన్ను పోటు పొడుస్తున్నాడని , కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టిన టీడీపీ ఎన్టీఆర్ వారసత్వాన్ని విలువలను త్యజించిందని పేర్కొన్నారు.  పదే పదే మోడీని తిడుతూ తెలుగు వారి సెంటిమెంట్ ను క్యాష్ చేసుకుంటున్నాడని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా బాబు విఫలమయ్యాడని.. 2019లో ప్రధాని పదవి నుంచి తనను దించేసేందుకు ఇతరులను నిలబెట్టేందుకు బాబు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. అయినా రాజకీయం అంటే ఎలా ఉంటుందో మన ప్రధాని గారికి మాత్రం తెలియదా? గురు స్థానం లో ఉన్న ఎల్కే అధ్వానిని అవమానించిన విషయాన్ని మాత్రం జనం ఎలా మర్చిపోతారు?