కేరళ వివాదం మీద వెనక్కి తగ్గండి: కాంగ్రేస్ నేతలకు సోనియా సూచన

16:44 - January 4, 2019

శబరిమల వివాదం రోజు రోజుకీ మరింత రాజుకుంటూనే ఉంది. ఇప్పుడు భారత దేశ అతిముఖ్యమైన విషయాలతో సమానంగా శబరిమలలోకి స్త్రీల ప్రవేశం అన్న అంశం కూడా చేరిపోయింది. గత మూడురోజుల్లో ముగ్గురు మహిళలు ఆలయంలోకి ప్రవేశించటంతో కేరళ మొత్తం ఒక ఉద్రిక్త వాతావరనం నెలకొది. ఆఖరికి పార్లమెంట్ లో కూడా చర్చించేంతగా ఈ విషయం రాజకీయాలని కూడా ప్రభావితం చేస్తోంది. 
 ఈ నేపథ్యం లోనే ఆలయంలోకి వచ్చే మహిళల పట్ల వ్యతిరేకంగా యాభై ఏండ్లలోపు మహిళలకు పోలీసు భద్రత కల్పించడం వల్ల ఇతర భక్తుల హక్కులకు భంగం కలుగుతున్నదని శబరిమల యాత్రా సీజన్‌ను పర్యవేక్షించేందుకు కేరళ హైకోర్టు నియమించిన ముగ్గురు సభ్యుల బృందం పేర్కొంది. ఈ మేరకు ఆ కమిటీ హైకోర్టుకు గురువారం ఒక నివేదికను కూడా సమర్పించింది.

     అయితే ఆలయంలోకి మహిళల ప్రవేశానికి వ్యతిరేకంగా కాంగ్రేస్ పార్టీ లోని కొందరు నేతలు కూడా నిరసన తెలపటానికి సిద్దమయ్యారు. కానీ ఆపార్టీ అధినేత్రి సోనియా మాత్రం నిరసన తెలపటనికి ఒప్పుకోలేదట. ఈ నిరసన విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీ తమ ఎంపీలకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన ఎంపీలు. ఇవాళ పార్లమెంట్‌లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయాలని భావించారు. కానీ సోనియా గాంధీ ఆ ఎంపీలను అలా చేయకుండా నివారించారు.

కేరళలో జరుగుతున్న బ్లాక్ డే ఆందోళనలకు నిజానికి ఎంపీలు సంఘీభావం తెలుపాలని నిర్ణయించుకున్నారు. కానీ సోనియా ఆ అంశంపై ఓ స్పష్టమైన వార్నింగ్ ఇవ్వడంతో వారు వెనక్కి తగ్గారు. జాతీయ స్థాయిలో తమ పార్టీ మహిళలకు సమాన హక్కులు కల్పించాలన్న ధ్యేయంతో ఉందని, అందుకే పార్లమెంట్‌లో అలాంటి నిరసన వద్దు అని తమ ఎంపీలకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిరసనలు కేవలం కేరళ రాష్ర్టానికి పరిమితం చేయాలని సోనియా తన ఆదేశాల్లో ఆ పార్టీ ఎంపీలకు క్లియర్ చేశారు. అయితే శబరిమల అంశంపై ఆర్డినెన్స్ తేవాలన్న నిర్ణయాన్ని పార్టీ సీనియర్ నేతలతో చర్చించిన తర్వాతే తీసుకుంటామని కేపీసీసీ ప్రెసిడెంట్ ముల్లపల్లి రామచంద్రన్ తెలిపారు. సో కాంగ్రేస్ పార్టీ తమ సెక్యులర్ నినాదం పై గట్టిగానే ఉన్నట్టు అనుకోవాలి మరి.