కరీనా చెప్పిన సమాధానం కరక్టేనా...?

14:09 - March 2, 2019

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ నోటి వెంట కొన్ని ఆసక్తికర మాటలు వినిపించాయి. తాజాగా సిమీ గరేవాల్‌ నిర్వహించిన ఇంటర్వూలో కరీనా పలు విశేషాలను వెల్లడించింది. ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యాత అడిగిన ఓ ప్ర‌శ్న‌కు క‌రీనా ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పింది. ' మీరు ఎవ‌రితో డేట్‌కు వెళ్లాల‌నుకుంటున్నారు' ? అని సిమీ ప్ర‌శ్నించాడు. ఈ ప్ర‌శ్న‌కు స్పందించిన క‌రీనా.. ' రాహుల్ గాంధీ ' అని చెప్పింది. మీరు అడిగిన ప్ర‌శ్న‌కు ఈ స‌మాధానం చెప్పొచ్చో, చెప్ప‌కూడ‌దో తెలియదు. అయినా చెబుతాను. నా స‌మాధానం వివాదాస్ప‌దం అవుతుందేమో. నేను రాహుల్ గాంధీతో డేట్‌కు వెళ్లాల‌నుకుంటున్నాను. అత‌ని గురించి పూర్తిగా తెలుసుకోవాల‌ని ఉంది. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి హీరో సైఫ్ ఆలీఖాన్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకుంది క‌రీనా క‌పూర్‌. ఈ జంటకు ఓ కొడుకు కూడా ఉన్నాడ‌నే సంగ‌తి తెలిసిందే. వివాహ‌మై తల్లి అయిన త‌ర్వాత కూడా క‌రీనా సినిమాల్లో న‌టిస్తూ బిజీగానే ఉంది. అంతేకాదు...మేగ‌జీన్‌లో అత‌ని ఫోటోలు చూస్తున్న‌ప్పుడు అనిపిస్తుంటుంది.. అత‌డితో మాట్లాడితే ఎలా ఉంటుందా అని. నేను పూర్తిగా సినిమాలకు అంకిత‌మైన కుటుంబం నుంచి వ‌చ్చాను. అయ‌న పూర్తి రాజ‌కీయ కుటుంబానికి చెందిన వ్య‌క్తి. కాబట్టి మా మ‌ధ్య జ‌రిగే చ‌ర్చ ఆస‌క్తిక‌రంగా ఉంటుందేమోన‌ని క‌రీనా చెప్పింది.