కథానాయకుడు: లాభం జానెడు....నష్టం మూరెడట!

15:48 - January 28, 2019

ఎన్నో అంచనాల మధ్య విడుదలై చివరికి డిజాస్టర్ గా ముద్ర వేయించుకున్న ఎన్టీఆర్ కథానాయకుడు తాలుకు విషాద వసూళ్ళ గాధలు ఒక్కొక్కటిగా బయటికి వస్తూనే ఉన్నాయి. 72 కోట్ల దాకా బిజినెస్ జరుపుకుని కేవలం 20 కోట్ల షేర్ రాబట్టుకున్న ఈ మూవీ ద్వారా ఫైనల్ గా 50 కోట్ల నష్టం రావడం ఊహకందనిది. యావరేజ్ అయినా దెబ్బ పెద్దగా ఉండేది కాదు కాని మరీ తీసికట్టు వసూళ్లు రావడం వల్లే ఇంత డ్యామేజ్ జరిగింది. ఇదిలా ఉండగా నిర్మాతలలో ఒకరైన సాయి కొర్రపాటికి ఈ బయోపిక్ వల్ల ఓ విచిత్రానుభవం కలిగింది. విడుదలకు ముందు చేసిన బిజినెస్ లో సహ నిర్మాతగా ఈయనకు 5 కోట్ల దాకా లాభం వచ్చిందట. అయితే నిర్మాతగా ఆ లాభం సరిపోతుందా...అందుకే మరింత లాభం కోసం చేసిన పనికి లాభం కాస్తా రివర్స్‌గా నష్టం వచ్చింది. అదేలాగా అనుకుంటున్నారా?..అయితే ఇది చదవండి... హిట్ అయితే ఇంకొంత వస్తుంది లెమ్మని అదే నమ్మకంతో ఓ రెండు ఏరియాలను తన స్వంత రిస్క్ తో రిలీజ్ చేసారు. కట్ చేస్తే బొమ్మ తిరగబడింది. ఒకటి కాదు ఏకంగా 8 కోట్ల నికర నష్టంతో జేబుకు పెద్ద చిల్లు పడింది. అంటే నిర్మాతగా వచ్చిన ఐదు కోట్ల లాభం తీసేయగా రివర్స్ లో 3 కోట్ల నష్టం మిగిలిందన్న మాట. ఇంత కన్నా విషమ పరీక్ష ఇంకొకటి ఉంటుందా. నిజానికి సాయి కొర్రపాటే కాదు ఎవరూ ఇంత పెద్ద ఫ్లాప్ ని ఊహించలేదు. డిసెంబర్ లో కెజిఎఫ్ రూపంలో మంచి లాభాలను జేబులో వేసుకున్న సాయి కొర్రపాటికి ఎన్టీఆర్ కథానాయకుడు పెద్ద షాకే ఇచ్చింది. ముగ్గురు నిర్మాతలు కాబట్టి సరిపోయింది. అదే సోలోగా ఎవరో ఒకరే తీసుంటే ఎలా ఉండేదో వేరే చెప్పాలా.  అయితే ముందు రాబోయే మహానాయకుడు ఫ్రీగా ఇస్తారు అనే ప్రచారం జరుగుతోంది కాని దాని వల్ల అద్భుతాలు జరిగితే తప్ప ఈ నష్టాల వల్ల కొంత రికవరీ కలగదు... అని బయట వినిపిస్తున్న టాక్‌.