ఎన్నికలవేళ సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి...

13:39 - March 23, 2019

వివాదాస్పద నటి శ్రీరెడ్డి గురించి చెప్పనవసరం లేదు. లైంగిక వేధింపుల్లో సినీరాజకీయ రంగ ప్రముఖులు సహా పలువురి లోగుట్టును లీక్‌ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనం అవుతోంది. ఇప్పటికే పలువురి ప్రముఖుల పేర్లను శ్రీరెడ్డి బయటపెట్టడం జరిగింది. ఇదిలా వుంటే శ్రీరెడ్డి చేసిన ఓ వ్యాఖ్య తనకు చావు తప్పి కన్ను లొట్టపోయేలా చేయడం సంచలనమైంది. గతంలో సంచలనం సృష్టించిన పొలాచీ సెక్స్ స్కాండల్ పై శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ సినీరాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. పొల్లాచీ సెక్స్ రాకెట్ లో ఎందరో అమ్మాయిలు బలైపోయారు. అదంతా పలువురు తమిళ రాజకీయ నాయకుల పనే.. వారి గుట్టు చెబుతానంటూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం రేపాయి. అనంతరం మిడ్ నైట్ లో శ్రీరెడ్డి ఇంటిపై కొందరు దుండగులు దాడి చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే దాడి నుంచి తప్పించుకున్న శ్రీరెడ్డి వలసరవాక్కం (తమిళనాడు) పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు అస్సలు భయపడనని శ్రీరెడ్డి వ్యాఖ్యానించడాన్ని బట్టి పొల్లాచీ వ్యవహారంలో పలువురు రాజకీయ నాయకుల గుట్టు లీక్ అవ్వడం ఖాయం అని అర్థమవుతోంది.  ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల వేళ శ్రీరెడ్డి ఇలా కొత్త ప్రకంపనాలకు తెర తీయడం వెనక ఏదైనా రాజకీయ కోణం ఉందా? అసలు పొల్లాచీ ఇన్సిడెంట్ తో శ్రీరెడ్డికి సంబంధం ఏంటి? అంటూ తమిళనాడు వ్యాప్తంగా ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.