ఉధ్యోగం కోసం పురిటి నొప్పులనీ భరించిన అమ్మ: పరీక్ష హాల్ లోనే కుప్పకూలి..

12:18 - January 4, 2019
ప్రభుత్వ ఉధ్యోగం అంటే మధ్యతరగతి భారతీయ పౌరులకు ఒక చాలెంజ్ లా మారిపోయింది. ఎన్ని కష్టాలు పడి అయినా ఒక్క గవర్నమెంట్ జబ్ తెచ్చుకుంటే జీవితం మీద ఉండే భరోసా వేరు. అందుకే ఎం టెక్ లూ, మాస్టర్ డిగ్రీలూ చేసి కూడా అటెండర్ గా అయినా సరే ప్రభుత్వ ఉధ్యోగంలోనే ఉండాలన్న తపన చూస్తూనే ఉన్నం. అదే తపన ఆతల్లిని పురిటినొప్పులు సైతం పంటిబిగువున భరించేలా చేసింది. పరీక్ష కోసం అత్యంత ప్రమాదకర స్తితిలో కూడా పరీక్ష రాసేలా చేసింది.  తొమ్మిది నెలలునిండి ప్రసవానికి సిద్దంగా ఉన్నా ఆవిషయం బయటికి చెప్పకుండా ఎగ్జాం హాల్లో కూచుంది. మధ్యలోనే నొప్పులు మొదలైనా పుట్టబోయే బిడ్డ కోసం అనుకుందేమో పంటి బిగువిన బాధని భరిస్తూ  పరీక్ష్అ అయ్యాక అక్కడే కుప్పకూలిపోయింది.
                      శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని నార్తురాజుపాలెంలో గురువారం జరిగింది. కావలి మండలం తాగేటివారిపాళెం గ్రామానికి చెందిన థన్యాసి స్వాతి, మహేష్‌లు నిరుపేద దంపతులు. కార్పెంటర్‌గా పనిచేస్తున్న మహేష్‌ కష్టపడితే గానీ కుటుంబం గడవని పరిస్థితి. దీంతో తన భార్య స్వాతిని ఆయన చదువులో ప్రోత్సహించారు. బుచ్చిరెడ్డిపాళెంలోని ఓ కళాశాలలో బీఈడీ పూర్తి చేయించారు. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం శిక్షణ కూడా ఇప్పించారు. డీఎస్సీ పరీక్ష కోసం ఆమె రేయింబవళ్లు కష్టపడి చదివింది. కొడవలూరు మండలం నార్తురాజుపాలెంలోని శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాలలో డీఎస్సీ పరీక్ష గురువారం ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు ఉండడంతో భర్తతో పాటు ఆమె పరీక్ష కేంద్రానికి చేరుకుంది. పరీక్ష రాస్తుండగా స్వాతికి పురుటి నొప్పులు ప్రారంభమయ్యాయి. బాధను దిగమింగి పరీక్ష రాసింది. పరీక్ష పూర్తైన వెంటనే ఆ పత్రాలను పరిశీలకుడికి ఇచ్చి స్పృహ కోల్పోయింది. కళాశాల ఛైర్మన్‌ పెనుబల్లి బాబునాయుడుకు విషయం  తెలియడంతో తన కారులో ఆమెను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.అక్కడే మగబిడ్డకు జన్మనిచ్చింది స్వాతి.