ఈ సంవత్సరం ఉత్తమోత్తమ చిత్రం ఏంటో తెలుసా?

12:06 - December 25, 2018

2018లో వచ్చిన అన్ని సినిమాల్లో ఉత్తమోత్తమ చిత్రం ఏది అని వెతికితే ' రంగస్థలం ' అని తేలింది. దీని తరువాత మహానటి, గీతా గోవిందం, భరత్‌అనే నేను, గూడాఛారి చిత్రాలు వరుసగా టాప్‌ 5 జాబితాలో నిలుస్తున్నాయి. `రంగస్థలం` చిత్రానికి అగ్ర తాంబూలం ఇవ్వడానికి కారణం ప్రత్యేకించి విశ్లేషించాలి. ఈ చిత్రంలో కథ అద్భుతం. గోదారి బ్యాక్ డ్రాప్ లో ఆ యాస - భాష - వేషంతో చిట్టిబాబుగా చరణ్ నటన అద్భుతం. అలాగే ఈ చిత్రంలో నటించిన సమంత - అనసూయ పాత్రలు హైలైట్. రంగమ్మత్తగా అనసూయ - రామలక్ష్మిగా సమంత అద్భుత అభినయంతో ఆకట్టుకున్నారు. ఇక ఆది పినిశెట్టి నటన మరో హైలైట్. పాటలు - కథాంశం - దర్శకత్వ ప్రతిభ ఇలా అన్ని విభాగాల్లో ఈ సినిమా కమర్షియల్గా ఉర్రూతలూగించింది. అందుకే ఇది నంబర్-1 చిత్రమనడంలో సందేహం లేదు. ఇక ఆ తర్వాత సావిత్రి జీవితకథతో తెరకెక్కిన `మహానటి` చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు నీరాజనం పలికారు. సామాన్య జనాలకు గొప్పగా చేరువైన ఈ చిత్రం నంబర్ 2 అనే చెప్పాలి. ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన `గీత గోవిందం` చిత్రానికి ఆ క్రెడిట్ దక్కుతుంది. దేవరకొండ- రష్మిక మందన నటన మైమరిపిస్తుంది. యూత్ కి బాగా చేరువైన చిత్రమిది. అందుకే ఈ సినిమా నంబర్ 3. మహేష్ నటించిన `భరత్ అనే నేను` స్టార్ పవర్ తో భారీ వసూళ్లు సాధించింది. దేవరకొండ- రష్మిక మందన నటన మైమరిపిస్తుంది. యూత్ కి బాగా చేరువైన చిత్రమిది. అందుకే ఈ సినిమా నంబర్ 3. మహేష్ నటించిన `భరత్ అనే నేను` స్టార్ పవర్ తో భారీ వసూళ్లు సాధించింది.