ఈసారైనా సాయిపల్లవి సెంటిమెంట్‌ వర్కవుట్‌ అవుతుందా?

11:26 - December 29, 2018

ఫిదా సినిమాతో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయిపోయింది సాయి పల్లవి. ఆమె యాక్టింగ్ కు ప్రేక్షకులే కాదు.. దర్శక నిర్మాతలు కూడా ఫిదా అయిపోయారు.  ఫిదా సినిమా తర్వాత సాయిపల్లవికి తెలుగులో దూసుకుపోతుంది అని అందరూ భావించారు. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు సాయిపల్లవికి తెలుగులో ఒక్క సినిమా కూడా సెట్స్ పై లేదు. పడిపడిలేచె మనసు - మారి 2..ఇలా అన్నీ వరుసగా షాక్ లిచ్చాయి. అందుకే.. ఈసారి తన సెంటిమెంట్ కు ఓటేసింది సాయిపల్లవి. అదేంటీ అనుకుంటున్నారా?..అయితే అసలు విషియానికి వెళ్తే... నీది నాది ఒకే కథ  సినిమాతో పాపులర్ అయిన వేణు ఒక మూవీ తెరకెక్కించబోతున్నారు. అదే విరాటపర్వం 1992. ఈ సినిమాలో హీరో రానా. రానా హైట్ తెలుసు కదా. 6 అడుగులు పైనే. ఈ సినిమా సాయి పల్లవి ఒప్పుకోవడానికి రానా హైటే అసలు కారణం. సాయిపల్లవికి పొడుగ్గా ఉన్న హీరోలే బాగా కలిసొస్తారు. ఫిదా సినిమాలో వరుణ్ హైట్ 6 అడుగుల 4 అంగుళాలు. సినిమా సూపర్ హిట్. శర్వానంద్ - ధనుష్ ఇద్దరి హైట్ ఆరు లోపే. అందుకే ప్లాప్ అయ్యాయని భావిస్తోంది. ఇప్పుడు తన కొత్త సినిమాలో మాంచి హైట్ ఉండే రానా హీరో అయ్యే సరికి మరో మాట లేకుండా సినిమా ఒప్పుకుంది సాయి పల్లవి. మరి ఈసారి అయినా సాయి పల్లవి సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందేమో చూద్దాం.