ఈరోజే అఖిల్ "హార్ట్ బ్రేక్" : సాయంత్రం ఆరు గంటలకి సిద్దంగా ఉండండి

05:05 - January 6, 2019

అక్కినేని వారసుడు అఖిల్ కి ఎంతటి స్టార్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కలిసి రాలేదు. డెబ్యూ సినిమానే అట్టర్ ఫ్లాప్, పోనీ రెండో సినిమా "హలో" అయినా ఆ లోటుని పూడుస్తుందీ అనుకుంటే అదీ అంతంత మాత్రంగానే బిలోయావరేజ్ అనిపించుకుంది. అయినా  ఏమాత్రం నిరాశ పడకుండా మళ్ళీ అదే ఉత్సాహం తో కనిపిస్తున్నాడు యువహీరో అఖిల్ అక్కినేని. అఖిల్ - హలో సినిమాలతో ఊహించని డిజాస్టర్స్ అందుకున్న ఈ అక్కినేని వారసుడు ఈ సారి "మిస్టర్ మజ్ఞూ" గా కొంచెం డిఫరెంట్ గా రాబోతున్నాడు.

          వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ అందుకుంటాననే నమ్మకంతో ఉన్నాడు.  'తొలిప్రేమ' చిత్రంతో దర్శకుడిగా తన టాలెంట్ నిరూపించిన వెంకీ అట్లూరి ఈసారి కూడా లవ్ స్టోరీనే ఎంపిక చేసుకున్నాడు. తొలి సినిమా "అఖిల్"తో కాస్త మాస్ గా ట్రై చేసి దెబ్బ తిన్న అక్కినేని వార‌సుడు. రెండో సినిమా నుంచి పూర్తిగా దారి మార్చుకున్నాడు. 
              "హ‌లో"లో లవ‌ర్ బాయ్‌గా క‌నిపించి మాయ చేసాడు. ఇప్పుడు పూర్తిగా మారిపోయి "మిస్టర్ మజ్ఞూ"తో మ‌రోసారి ల‌వ‌ర్ బాయ్ పాత్ర‌లో వ‌స్తున్నాడు. టీజర్ చూస్తుంటే అఖిల్ కి ఈ సినిమా ప్లస్ అయ్యేలాగే ఉంది. దర్శకుడు వెంకీ అట్లూరి ఇది వరకే తొలిప్రేమ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో అఖిల్ ను ప్లే బాయ్ గా చూపించి మంచి ఎంటర్టైనర్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ‘మిస్ట‌ర్ మ‌జ్ను’ సినిమా టీజ‌ర్ యూ ట్యూబ్‌లో బాగానే ట్రెండ్ అవుతుంది. తొలి టీజ‌ర్‌కు ఊహించిన రెస్పాన్స్ రాలేదు కానీ రెండో టీజ‌ర్ లో కాస్త రొమాన్స్ కూడా ఎక్కువ‌గా ఉండ‌టంతో ఈ టీజ‌ర్‌కు రెస్పాన్స్ బాగానే ఉంది. 
     ఇందులో మ‌రో పాట జనవరి 6 సాయంత్రం 6 గంటలకు "హార్ట్ బ్రేక్" అనే పాట విడుద‌ల కానుంది.  థ‌మ‌న్ సంగీతం అందించిన ఆల్బం లో ఇప్ప‌టి వ‌ర‌కు రెండు పాట‌లు విడుద‌ల‌య్యాయి. ఈ రెండు పాట‌ల‌కు రెస్పాన్స్ సో సో నే. కానీ ఇప్పుడు వ‌చ్చే పాట మాత్రం క‌చ్చితంగా హార్ట్‌కు ట‌చ్ అవుతుందంటున్నాడు ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌నున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. చూడాలి మరి అఖిల్ కెరీర్ ని మిస్టర్ మజ్ఞూ  అయినా దారిలో పెడతాడో లేదో.