ఇక రైల్లో ఎక్కాలంటే ఇవి పాటించాల్సిందే: రక్షణ కోసం కొత్త పద్దతులు 

05:06 - January 7, 2019

మన రైల్వేస్టేషన్లు కూడా ఇక విమానాశ్రయాల స్థాయికి చేరనున్నాయి. అంటే మరీ ఎక్కువ ఊహించుకోకండి మామూలుగా ఏయిర్ పోర్టుకి ఎలా అయితే కొన్ని గంటల ముందుగా బయలు దేరతారో అలాగే ఇకనుంచీ రైల్వేస్టేషన్ కి కూడా ముందుగానే చేరుకోవాలి. సరిగ్గాసమయనికి వెళ్ళి టికెట్ తీసుకొని రైల్లో కూచోవాలంటే ఇక నుంచీ కుదరదు. ఎందుకంటే  రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేయాలని  రైల్వే శాఖ నిర్ణయించింది.

విమానాశ్రయాల్లో మాదిరిగా ఇకనుంచీ రైల్వే స్టేషన్లలో కూడా భద్రతా తనిఖీలు కట్టుదిట్టం చేయబోతోంది. దీంతో ప్రయాణికులు తమ తమ రైళ్ళ కోసం నిర్దేశిత సమయం కన్నా ముందుగానే స్టేషన్లకు చేరుకోవలసి ఉంటుంది. తనిఖీల తర్వాతే మీరు రైల్క్కాల్సి ఉంటుంది. అంటే ఇంతకు ముందులాగా హడావిడిగా సరిగ్గా రైలు వచ్చే సమయానికే స్టేషన్ కి చేరుకుంటామంటే కుదరదు. విమాన ప్రయాణికులు విమానం రాకకు సంబంధించి ప్రకటిత సమయానికి కొద్ది గంటల ముందు విమానాశ్రయాలకు చేరుకోవలసి ఉంటుంది. ఈ పద్ధతినే రైల్వే స్టేషన్లకు కూడా వర్తింపజేయాలని భారతీయ రైల్వే శాఖ కృషి చేస్తోంది.
 
రైల్వే రక్షణ దళం డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం రైలు రైల్వే స్టేషన్‌కు చేరుకునే ప్రకటిత సమయానికి కనీసం  15 నుంచి 20 నిమిషాల ముందు ప్రయాణికులు ఆ స్టేషన్‌కు చేరుకోవాలి. ఈ సమయంలోనే  భద్రతాపరమైన తనిఖీలు పూర్తి చేస్తారు. ఈ తనిఖీల అనంతరం మాత్రమే ప్రయాణీకులు ఫ్లట్ఫారం మీదకి వెళ్ళటానికి అనుమతి ఉంటుంది.

ఇప్పటికైతే ప్రాథమికంగా ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, కర్ణాటకలోని హుబ్లీ రైల్వే స్టేషన్లలో అత్యాధునిక భద్రతాపరమైన తనిఖీ యంత్రాంగాలను ఏర్పాటు చేశారు. అదే తరహాలో మరో 202 రైల్వే స్టేషన్లలోకూడా ఈ విధానం అమలుకు ప్రణాళికలు రచించారు. అంతేకాదు అన్ని వైపులనుంచీ ఎవ్వరూ చొరబడకుందా ఆర్‌పీఎఫ్ సిబ్బంది కాపలాతో రక్షణ పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.


అయితే ఈ పద్దతివల్ల ఫ్లాట్ఫారం మీద ఉండే అనవసర రద్దీ కూడా తగ్గుతుందనీ, ఆలస్యంగా నడుస్తున్న రైల్లలో ఎక్కాల్సిన ప్రయాణీకులు ఫ్లాట్ఫారం బయటే ఉందటం వల్ల రైలు ఎక్కే  ప్రయాణీకులకు అసౌకర్యం లేకుండా ఉంతుందనీ చెబుతున్నారు. అందువల్ల విమానాశ్రయాల్లో మాదిరి ఇక నుంచి రైల్వే స్టేషన్లలో కూడా ఆంక్షలు విధించనున్నారు. అయితే విమాశ్రయం మాదిరిగా గంటల సమయం ముందుగా వెళ్లాల్సిన అవస్రం లేదు 15-20 నిమిషాలు ముందుగా స్టేషన్ చేరుకుంటే చాలు.