ఇక్కడినుంచే: ప్రకాశ్ రాజ్ పోటీ చేయనున్న నియోజకవర్గం ఇదే

04:38 - January 6, 2019

గత కొన్నేళ్లుగా రాజకీయాలపై తన అభిప్రాయాలను మొహమాటం లేకుండా పంచుకుంటు నిరంతరం వివాదస్పద వార్తల్లోనిలుస్తున్న విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్. ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదో అన్న విషయంలో మాత్రం ఎటూ తేల్చకుండానే గడిపేశారు. అయితే 2019 న్యూ ఇయర్ సందర్భంగా ట్విట్టర్ ద్వారా అందరికీ శుభాకాంక్షలు చెప్పిన విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్. తాను ఈ ఏడాది ఎంపీగా పోటీ చేయబోతున్నట్టు ప్రకటించేశాడు. ఇది మరీ ఊహించని వార్త ఏమీ కాదుగానీ ఇప్పుడు హఠాత్తుగా చెప్పటం మాత్రం ఒకింత ఆశ్చర్యాన్నే కలిగించింది.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని ప్రకాశ్ రాజ్ గత మంగళవారమే స్పష్టం చేసిన ప్రకాశ్ రాజ్ ఏ స్థానం నుంచి బరిలో దిగుతున్నాననేది మాత్రం వెల్లడించలేదు. ఆ తర్వాత వెంతనే టీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ని కలవటం, ఆయనకు కేటీఆర్ మద్దతు ప్రకటించటంతో. తెలంగాణ నుంచి ఆయన పోటీ చేస్తారనేమోనని వార్తలు వెలువడ్డా అవన్నీ ఊహాజనితమేనని దాదాపుగా తేలిపోయింది. ప్రకాశ్ రాజ్ కర్ణాటక నుంచి పోటీ చేయడం ఖాయమైంది.

ఇక ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్న విషాయాన్ని మరోసారి ధృవీకరిస్తూ తాను పోటీ చేయనున్న నియోజకవర్గం పేరు కూడా ప్రకటించేశాడు. కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపిన ప్రకాశ్ రాజ్. తన రాజకీయ ప్రవేశానికి మద్దతుగా నిలుస్తున్న అందరికీ కృతజ్ఞతలు చెబుతూ మిగతా వివరాలు మరికొద్ది రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తానని ట్వీట్ చేసాడు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి తాను రెడీ అవుతున్నట్టు ప్రకాశ్ రాజ్ ప్రకటించగానే మంచి స్పందన వచ్చింది. టీఆర్ ఎస్ ఇప్పటికే ఆయనకు మద్దతు ప్రకటించగా. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తోడైంది. ప్రకాశ్ రాజ్ కు తాము సపోర్ట్ చేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించింది. దక్షిణాదిన బహుభాషా నటుడిగా పేరున్న ఆయన. ఏ ప్రాంతం నుంచి పోటీ చేస్తారనే విషయం పెద్ద చర్చకే దారి తీసింది. ఏపీ, తెలంగాణలలో అంటూ పలు పుకార్లు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ ఇవాళ తన ట్వీట్ ద్వారా పూర్తి క్లారిటీ ఇచ్చేశాడు ప్రకాశ్ రాజ్.