ఆసక్తి గొలుపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్: "ధీవర" ఫస్ట్ లుక్

05:44 - January 6, 2019

తెలుగులో వైవిధ్యమైన సినిమాల హవా పెరుగుతోంది. కొత్తగా వస్తోన్న దర్శకులే కాదు. నిర్మాతలు కూడా ఈ తరహా కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో మరో డిఫరెంట్ మూవీ రాబోతోంది. సినిమా పేరు ధీవర. నాగసాయి, విదా చైతన్య హీరోహీరోయిన్లుగా నటించారు. టైటిల్ కు తగ్గట్టుగానే డైనమిక్ స్క్రిప్ట్ తో డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతోంది. 
   ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దర్శకుడు బాబీ విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను ఆకట్టుకునే కథాంశమిది. పోస్టర్ బాగుంది. యూనిట్ అందరికి ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టాలి అని అని కోరుకున్నారు. ఈ సినిమా దర్శకుడు "విజరు జిక్కి" మాట్లాడుతూ టైటిల్‌కు తగినట్లుగానే వైవిధ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. 
   అంతర్లీనంగా చక్కటి ప్రేమకథ మిళితమై ఉంటుంది. ప్రేమ నుంచి ఎవరూ పారిపోలేరనే కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిస్తున్నాం. రెండు జోనర్స్ కలయికగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే ఈ చిత్రం వినూత్నమైన అనుభూతిని పంచుతుంది అని చెప్పారు. యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుతున్నాం. త్వరలో చిత్ర గీతాలతో పాటు ట్రైలర్‌ను విడుదలచేస్తాం. ఫిబ్రవరి నెలాఖరున సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అద్దంకి వెంకటేష్, సినిమాటోగ్రఫీ: సాగర్ గొళ్లా.