ఆయన మరణం చాలా బాధాకరం...ఆయన నన్ను తమ్ముడిలా ఆదరించారు: చిరంజీవి

14:56 - February 12, 2019

ప్రముఖ సినీ దర్శకుడు, పాత్రికేయుడు, కథా రచయిత విజయ బాపినీడు మృతి చెందిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి.. బాపినీడు భౌతికకాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. చిరంజీవి హీరోగా వచ్చిన ' మగ మహారాజు ' తో ఆయన దర్శకుడిగా మారారు. మహానగరంలో మాయగాడు, మగధీరుడు, ఖైదీ నంబర్ 786, గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను బాపినీడు గారు ఇండస్ట్రీకి అందించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ''విజయ బాపినీడు మృతి బాధ కలిగించింది. ఆయనతో ఆరు సినిమాలు చేశా. ఆయన నన్ను సొంత తమ్ముడిలా ఆదరించారు. బాపినీడు కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా'' అన్నారు. కాగా బాపినీడు గారి మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.