అప్పు చేయటం తప్పా? కావాలనే నన్ను నేరస్తుడిని చేస్తున్నారు: నీరవ్ మోదీ

16:30 - January 5, 2019

పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో రూ.13 వేల కోట్ల మేర మోసగించిన కేసులో నీరవ్ మోదీ, అతడి మేనమేమ మెహుల్ ఛోక్సీ నిందితులుగా ఉన్నసంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ ఈపుడు కొత్త కారణం ఒకటి చెబుతున్నాడు. ఒక ‘సివిల్ లావాదేవీ’ని పెద్ద కుంభకోణంగా చూపించి తనను అభాసుపాలు చేస్తున్నారని ఎదురుదాడి మొదలు పెట్టాడు.  అసలు జరిగిన విషయాన్ని అనవసరంగా అధికారులు ఇంతదాన్ని అంతచేసి చూపిస్తున్నారంటూ ఆరోపించాడు. "పరారీ ఆర్ధిక నేరగాళ్ల చట్టం" కింద నీరవ్ మోదీని ‘పరారీ ఆర్ధిక నేరస్తుడి’గా ప్రకటించాలంటూ ఈడీ ఇటీవల పీఎంఎల్ఏ కోర్టులో ఫిర్యాదు చేసింది. దీనిపై నీరవ్ మోదీ ఇవాళ పీఎంఎల్‌ఏ కోర్టుకు తన స్పందన తెలిపారు. భద్రతా కారణాల వల్లే తాను భారత్‌కు తిరిగి రాలేకపోతున్నాననీ కావలనే తనని ఒక పెద్ద నేరగాడిగా చిత్రైంచటం జరుగుతున్నదంటూ చెప్పుకొచ్చాడు.


   రాజ్య‌స‌భ‌లో నీర‌వ్‌కు సంబంధించిన ప్ర‌శ్న‌పై కేంద్ర మంత్రి వీకే సింగ్ స్పందించారు. నీర‌వ్ బ్రిట‌న్‌లోనే ఉన్నాడ‌ని మాంచెస్ట‌ర్ క్రైమ్ బ్యూరో త‌న ద‌ర్యాప్తులో తేల్చింద‌ని మంత్రి తెలిపారు. నీర‌వ్‌ను అప్ప‌గించాల‌ని బ్రిట‌న్‌కు లేఖ‌లు కూడా రాసిన‌ట్లు ఆయ‌న చెప్పారు. అయితే తాము చేసిన అభ్య‌ర్థ‌న‌ల‌ను బ్రిట‌న్ ప‌రిశీలిస్తోంద‌న్నారు. థాయిలాండ్‌లో ఉన్న 13 కోట్ల కంపెనీని కూడా నీర‌వ్ కేసుకు అటాచ్ చేయాల‌ని ఈడీ అభ్య‌ర్థించింది. మనీ లాండరింగ్ కుంభకోణంలో నీరవ్ మోదీ, అతడి మేనమేమ మెహుల్ ఛోక్సీ ప్రధాన నిందితులు అంటూ వార్తలు వచ్చేసమయానికే వీరిద్దరూ దేశం విడిచి పారిపోయారు. అప్పటి నుంచి భారత కోర్టులు, దర్యాప్తు సంస్థలు పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ముఖం చాటేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం నీరవ్ మోదీ లండన్‌లో తలదాచుకుంటున్నట్టు భావిస్తుండగా. మెహుల్ ఛోక్సీ కరీబియన్ దేశమైన ఆంటిగ్వాలో ఆశ్రయం పొందుతున్నారు. నేరస్తుల అప్పగింత కింద వీరిద్దరినీ స్వదేశానికి పంపాలంటూ ఇప్పటికే భారత ప్రభుత్వం ఈ దేశాలను కోరింది.