అప్పటివరకూ తెలంగాణా అసెంబ్లీలో అడుగు పెట్టను: వివాదస్పద ఎమ్మెల్యే రాజా సింగ్ 

05:05 - January 7, 2019

ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యేకు బాధ్యతలు అప్పగించడాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తప్పుబట్టారు. మజ్లిస్ ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్‌గా ఉన్న సమయంలో తను అసెంబ్లీకి వెళ్లేది లేదని ప్రకటించారు. సీఎం కేసీఆర్ తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలని, సీఎం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే తెలంగాణకు ఎంతో మంచిదనీ. హిందువులను అవమానించి, ‘వందేమాతరం’ పలకని, ‘భారత్ మాతాకీ జై’ అనని వాళ్ల పార్టీ ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించడంపై మండిపడ్డారు. అసలు విషయం ఏమిటంటే.. 

మజ్లిస్ పార్టీకి ప్రొటెం స్పీకర్ బాధ్యతలు అప్పగిస్తే తాను అసెంబ్లీలో అడుగుపెట్టనని బీజేపీ తరఫున గోషామహల్ నుంచి గెలిచిన రాజాసింగ్ లోథ్ స్పష్టం చేసారు. ప్రొటెం స్పీకర్‌గా మజ్లిస్ పార్టీ చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై రాజాసింగ్ స్పందించారు. నిజాం ఫాలోవర్, మజ్లిస్ ఫాలోవర్ అయిన కేసీఆర్ గత రాత్రిపూట మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేను మూడు రోజుల పాటు ప్రొటెం స్పీకర్‌గా చేస్తూ నిర్ణయం తీసుకున్నారని, రాత్రి పూట నిర్ణయం తీసుకున్నారని ఒకటికి రెండుసార్లు ప్రస్తావించారు. 
                  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాం వారసుడిగా, ఎంఐఎం మద్దతుదారుగా ప్రవర్తిస్తున్నారని రాజాసింగ్ విమర్శించారు. ఎంఐఎం ఎమ్మెల్యేను తెలంగాణ ప్రొటెం స్పీకర్‌గా నియమించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో సభ నడిచినన్ని రోజులు. సభకు హాజరు కాబోనని స్పష్టం చేశారు రాజాసింగ్. అధికారులతో మాట్లాడి. ఎప్పుడు ప్రమాణం చేయాలనే విషయాన్ని నిర్ణయించుకుంటానని, మజ్లిస్ ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్‌గా మిగతా ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని, అదే జరిగితే తాను అసెంబ్లీకి వెళ్లడం లేదని, మజ్లిస్ ప్రొటెం స్పీకర్ ఎదుట ప్రమాణ స్వీకారం చేసేది లేదన్నారు.‘సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని తను తీసుకున్నారు.. ఇప్పుడు నా నిర్ణయాన్ని నేను తీసుకున్నాను’’ అన్నారు. రాజ్యాంగ నిపుణులతో మాట్లాడి తన తర్వాతి నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు. ఓ వీడియో సందేశం విడుదల చేసిన రాజాసింగ్. ఈ వ్యాఖ్యలు చేశారు.