అనుష్క లుక్‌ అదిరింది

17:54 - December 25, 2018

అందం .. అంతకి మించిన అభినయం అనుష్క సొంతం. నాయిక ప్రాధాన్యత కలిగిన కథలతోను విజయాలను అందుకున్న ఘనత ఆమె సొంతం. అలాంటి అనుష్క ఇటీవల కాలంలో సినిమాల సంఖ్య తగ్గించింది. జీరో సైజ్‌ సినిమా కోసం లావైన అనుష్క అదే సైజుతో భాగమతి సినిమా తీసింది. దానికి అంతగా ప్రాధాన్యత దక్కలేదు. కొన్నాల్లు సినిమాలకు దూరంగా వుండి ఆ లావుని తగ్గించుకునే పనిలో వున్న సంగతి తెలిసిందే. అయితే...కథాబలం .. పాత్ర బలం కలిగిన సినిమాలు మాత్రమే చేయాలనుకున్నట్టు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది. ఈ నేపథ్యంలోనే కోన వెంకట్ వినిపించిన ఒక కథ నచ్చడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమాకి ఆయన ఒక నిర్మాతగాను వ్యవహరిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా నుంచి అనుష్క పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. ఇప్పటివరకూ వచ్చిన అనుష్క లుక్స్ లో ఇది బెస్ట్ అనిపిస్తోందని కోన వెంకట్ అన్నారు. తమ సినిమా నుంచి వచ్చిన ఈ లుక్ తనకి బాగా నచ్చిందని చెప్పారు. నెమలి ఈక పట్టుకుని ప్రేమ భావనతో .. ఆరాధనా పూర్వకంగా చూస్తున్నట్టుగా వున్న అనుష్క లుక్ నిజంగానే మనసులు దోచేలా వుంది.