అనుమానాలూ సందేహాల మధ్య: తెలంగాణా నిరుద్యోగ భృతి

12:56 - January 5, 2019

నిరుధ్యోగ భృతి ఈ సారి ఎన్నికల్లో టీఆరెస్ చేసిన ముఖ్యమైన వాగ్ధానాల్లో ఇదీ ఒకటి. అంతే కాదు ఇప్పటివరకూ మనవాళ్ళు ప్రకటించిన మొత్తమే ఎక్కువగా ఉంది. దీనివల్ల కష్టాలు తీరకపోవచ్చు గానీ కొంతలో కొంత సహాయంగా ఉంటుందనే భావించారు తెలంగాణా విధ్యార్థులూ, నిరుధ్యోగులూ. అయితే ఈ నిరుధ్యోగ బృతికి అర్హత పొందాలంటే మాత్రం కష్టం మామూలుగాలేదు. ప్రాథమికంగా రూపొందించిన నిబంధనల ప్రకారం 18-35 ఏళ్ల మధ్య వయసులో ఉండి చేయడానికి పనిలేకుండా ఉన్నవారినే నిరుద్యోగులుగా గుర్తించనున్నారని తెలుస్తోంది. వయోపరిమితిలో వెసులుబాటు కల్పించడంపైనా చర్చ జరుగుతున్నట్టు సమాచారం.  


తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులై ఉండాలి. కనీస విద్యార్హత డిగ్రీ లేదా డిప్లొమా పూర్తిచేసి ఉండా లి. 22- 35 ఏళ్ల మధ్య వయసు కలిగి న వారు అర్హులు. పేదరికానికి దిగువనున్న కుటుంబంలో ఎంతమందినైనా అర్హులుగా ప్రకటిస్తారు. నాలుగు చక్రా ల వాహనం తరహాలో ఆ వ్యక్తి పేరిట వాహనాలు ఉంటే అనర్హులుగా ప్రకటిస్తారు. 2.50 ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాల మెట్ట భూమి కలిగి ఉన్నవారు అనర్హులు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ. 50 వేలకుపై గా సబ్సిడీ రుణం పొందిన అభ్యర్థులెవరైనా అనర్హులే. పబ్లిక్‌ సెక్టార్‌లో గవర్నమెంట్‌ లేదా స్వయం ఉద్యోగం కలిగిన వారు, అనియత విద్య పొందిన వారు, ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించబడిన వారు, ఏ విధమైన క్రిమినల్‌ కేసులు కలిగింటే వారు కూడా ఈ పథకానికి అనర్హులుగా ప్రకటిస్తారు.


                            నిరుద్యోగ భృతి అమలు చేస్తున్న ఏడు రాష్ట్రాల నుంచి ఇప్పటికే అధికారులు ప్రాథమిక సమాచారం తెప్పించుకున్నట్టు తెలిసింది. ఛత్తీస్ గఢ్ లో 12వ తరగతి పాసై - ఏడాదికి రూ.2 లక్షలలోపు కుటుంబ ఆదాయం ఉన్న 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగులకు భృతి నెలకు రూ.1000 - దివ్యాంగ నిరుద్యోగులకు నెలకు రూ.1500 ఇస్తున్నది. హిమాచల్ ప్రదేశ్ లో దాదాపు ఇవే నిబంధనలున్నా.. వయో పరిమితి 20-35 ఏళ్లుగా ఉంది. కేరళలో నెలకు రూ.120 భృతి ఇస్తున్నారు. మధ్యప్రదేశ్ లో నెలకు రూ.1000 - వారు దివ్యాంగులైతే రూ. 1500 ఇస్తున్నారు. రాజస్థాన్ లో నిరుద్యోగులకు నెలకు రూ.650 - మహిళలైతే నెలకు రూ.750 ఇస్తున్నారు. ఏపీలో 22-35 ఏళ్ల మధ్య వయసుండి - డిగ్రీ లేదా డిప్లొమా చేసిన నిరుద్యోగులకు నెలకు రూ.1000 భృతి ఇస్తున్నారు. హర్యానాలో వార్షికాదాయం రెండు లక్షల వరకు ఉండి - 35 ఏళ్లలోపు ఉన్న ఎస్సెస్సీ ఉత్తీర్ణులైన వారికి నెలకు రూ.100 - 12వ తరగతి పాసైన వారికి నెలకు రూ.900 - డిగ్రీ వారికి రూ.1500 - పీజీ వారికి 3000 నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. వీటన్నింటిపై అధ్యయనం చేసి - తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా సమగ్రమైన విధానం రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయారు. 

అయితే ఈ పథకాని అమలు చేయటం పై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు ఏ పనీ చేయకుండా ఉండిపోవటం అంటే ఎలా? ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో కనీసం ఒక నిరుధ్యోగి ఉధ్యోగాలకి అప్లికేషన్లూ, ఇంటర్వ్యూలకి అటెండ్ అవటాలూ లాంటి అవసరాలకు ప్రభుత్వం ఇచ్చే డబ్బు ఏమాత్రం సరిపోదు. ఇచ్చే బృతి ఉపయోగకరంగా ఉందాలి అంటే. వాళ్ళు చేసుకునే చిన్నపాటి పనులను చేసుకుంటున్న అర్హులుగానే పరిగణించాలి అన్నది మెజారిటీ నిరుధ్యోగుల అభిప్రాయం. 

అయితే ఈ భౄతి విషయంలో అమలుకు కొంత వెసులుబాటు తీసుకునైనా సరే. పక్కాగా అమలుచేయాలని సర్కారు పెద్దలు భావిస్తున్నారు. ఇందుకోసం నిరుద్యోగుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవాలా? ఉపాధికల్పన కేంద్రాల్లో పేర్లను రిజిస్టర్ చేయించాలా? అనే అంశాలపై సమాలోచనలు సాగుతున్నాయి. జిల్లాస్థాయిలో నిరుద్యోగుల జాబితాను ఫైనల్ చేసేలా మార్గదర్శకాలు రూపొందించే అంశంపైనా కసరత్తు చేస్తున్నారు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసేవారు ఈ పథకానికి దరఖాస్తుచేసి లబ్ధిపొందితే తీవ్ర నేరంగా పరిగణిస్తారని సమాచారం. అలాంటివారిని గుర్తించేందుకు ఏర్పాట్లు ఉంటాయని తెలుస్తోంది. ఈ ఏడాది తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2) నుంచీ ప్రారంభిస్తారని సమాచారం.