గల్లీ బాయ్ (ట్రైలర్) :  మరో గల్లీ రాక్ స్టార్ కథ, ట్రైలర్ లోనే మొత్తం సినిమా

06:05 - January 10, 2019

 

 

 

 

 

 

 

 

బాలీవుడ్ ఇప్పుడు మళ్ళీ మురికి వాడల మీద దృష్టి పెట్టింది. "గల్లీ బాయ్" కలలని తెరమీదకి తెచ్చింది. నిజానికి ఇదీ ఒక మురికి వాడలనుంచె ఎదిగిన ర్యాపర్ కథ.  సింబా హిట్‌తో ఊపు మీదున్న రణ్‌వీర్ సింగ్ ఈసారి గల్లీ బాయ్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. జోయా అక్తర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ బుధవారం విడుదలైంది. లక్ బై ఛాన్స్'.. 'జిందగీ న మిలేగి దొబారా' లాంటి సినిమాలతో మెప్పించిన జోయా అఖ్తర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'గల్లీ బాయ్'.  రణవీర్ సింగ్.. అలియా భట్ ఈ సినిమాలో హీరో హీరోయిన్లు గా నటించారు.  జోయా.. ఆమె సోదరుడు ఫర్హాన్ అఖ్తర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది. 

రెండు నిముషాల 42 సెకన్ల ట్రైలర్ లో పెద్ద ర్యాపర్ కావాలనే కలలు గానే పేదింటి ముంబై అబ్బాయిగా రణవీర్ సింగ్ కనిపించాడు.  ఈ ప్రాసెస్ లో తనకు ఎదురయ్యే తిరస్కారాలు. ఎలా ఫైనల్ గా ర్యాపర్ గా విజయం సాధించాడన్నది సినిమా కథాంశం అని అర్థమయిపోతోంది.  రణ్‌వీర్, ఆలియా తమ పర్ఫార్మెన్స్‌లతో అదరగొట్టారు. అప్నా టైమ్ ఆయేగా అనే క్యాప్షన్‌ను చూస్తేనే మూవీ ఉద్దేశమేంటో అర్థమవుతున్నది. 

 మేరీ గల్లీ, రూట్స్‌లాంటి హిట్ ర్యాప్ సాంగ్స్ సృష్టికర్త అయిన ఇండియన్ ర్యాపర్ డివైన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది.  విజయ్ రాజ్. కల్కి కోచ్లిన్ లు ఇతర కీలక పాత్రల్లో నటించారు.  ట్రైలర్ చూస్తుంటే సినిమా సంచలనం సృష్టించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనిపిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. అంతకుముందే బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ మూవీని ప్రదర్శించనున్నారు.  ట్రైలర్ కి వచ్చిన హిట్స్ చూస్తె సినిమా కూడా హిట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.